Magazines

నీళ్లుంటే తమిళనాడుకు ఇచ్చేవాళ్లం: డీకే శివకుమార్‌

4 గంటల క్రితం

If we had water, we would have given it to Tamil Nadu: DK Shivakumar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : కావేరి జలాలను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీనిపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ స్పందించారు. రాష్ట్రంలో తగినంత నీటి నిల్వలు ఉంటే తప్పకుండా తమిళనాడుకు నీటిని విడుదల చేసేవాళ్లమని తెలిపారు. ప్రస్తుతం కర్ణాటకలో తాగునీటికి కూడా ఇబ్బందులు ఉన్నాయని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. నీటి ఎద్దడి కారణంగా కావేరి నదికి నిర్వహించే సంప్రదాయ ‘బాగిన’ పూజను కూడా చేపట్టలేకపోయామని చెప్పారు. మరోవైపు కావేరి జలాల వివాదం, మేకెదాటు ప్రాజెక్టుపై తమిళనాడు కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. ఈ అంశాలను పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లి వాస్తవాలు వివరిస్తానని డీకే శివకుమార్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్