Magazines

‌తెలంగాణ భవన్‌‌లో మౌలానా ఆజాద్‌ జయంతి వేడుకలు

19 నిమిషాల క్రితం

Maulana Azad birth anniversary
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌ : దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌ ‌కలాం ఆజాద్ జయంతి వేడుకలు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌లో ‌బుధవారం ఘనంగా జరిగాయి. మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మెన్ ఇంతియాజ్ అహ్మద్, బీఆర్ఎస్ నేతలు ఆజం అలీ, అర్షద్ అలీఖాన్, నియాజీ తదితరులు మౌలానా ఆజాద్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తోందని చెప్పారు. కేసీఆర్ పాలనలో మైనార్టీలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం లభించిందని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అన్ని విధాలుగా నష్టపోతు న్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మూడేండ్ల పాలనలో మైనార్టీ డిక్లరేషన్ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్