Magazines

హైదరాబాద్‌‌కు పూర్వవైభవమే నా సంకల్పం

12 నిమిషాల క్రితం

Hyderabad
avatar
balaji

ప్రచురించబడింది నవం 12, 2026 | 4 నిమిషాల చదవడం

సీఎం రేవంత్ రెడ్డి
మాదాపూర్‌‌లో తమ్మిడికుంట చెరువు ప్రారంభం


నవతెలంగాణ-సిటీబ్యూరో/మాదాపూర్‌
సిటీ ఆఫ్ లేక్స్‌గా హైదరాబాద్‌కు పూర్వవైభవం తీసుకురావడమే తమ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లో సర్వాంగ సుందరంగా పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువును అక్కినేని నాగార్జున తో కలిసి ముఖ్యమంత్రి బుధవారం ప్రారం భించారు. భావితరాలకు ఉపయోగపడేలా, హైడ్రా ఆధ్వర్యంలో తమ్మిడికుంట చెరువును అద్భుతంగా అభివృద్ధి చేసినట్లు సీఎం తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. శిల్పులు చెక్కని శిల్పాలు ఎన్నో మన హైదరాబాద్‌ చుట్టూ ఉన్నాయి. ఓఆర్‌ఆర్‌ లోపల 1372 చెరువుల్లో 50శాతం కనుమరుగయ్యాయన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు కొందరికి నష్టం జరిగినా కొన్ని తరాలకు మేలు జరుగుతుందన్నారు. తమ్మిడికుంటను 14 ఎకరాల నుంచి 30 ఎకరాలకు విస్తరించామని, చెరువు అభివృద్ధి కోసం నాగార్జున రెండెకరాలు ఉదారంగా ఇచ్చారని తెలిపారు. సినిమాల్లోనే కాదు, నాగార్జున నిజ జీవితంలోనూ హీరో లాంటి నిర్ణయం తీసుకున్నారని అభినందించారు. నీళ్ల ఆవాసాన్ని మనం ఆక్రమిస్తే ఆ నీళ్లు మన జీవితాలను ఆక్రమిస్తున్నాయని, మూసీ రివర్‌ ఫ్రంట్‌ను వందేండ్ల క్రితమే నిజాం అభివృద్ధి చేశారని గుర్తు చేశారు.

హైదరాబాద్‌ నాగరికత మూసీ పరివాహకంలోనే అభివృద్ధి జరిగిందని, ప్రపంచంలోనే ఉత్తమ ముత్యాలు మూసీ, చార్మినార్‌ ప్రాంతాల్లో దొరుకుతాయని సీఎం అన్నారు. కాలుష్యం తో నిండిపోయిన మూసీ నదిని ప్రక్షాళన చేసి తీరుతామని స్పష్టం చేశారు. హైడ్రాను ఏర్పాటు చేసినప్పుడు వ్యతిరే కత వచ్చిందని, ఆయినా వెనుకడుగు వేయ కుండా ముందుకెళ్తున్నామన్నారు. నేడు 50 శాతం చెరువులు కనుమరుగయ్యాయని, దాంతో చినుకుపడితే చాలు హైదరాబాద్‌ అతలాకుతలమవుతోందని, రోడ్లు జలమ యమై, ట్రాఫిక్‌‌కు తీవ్రఅంతరాయం కలుగు తోందన్నారు. . వర్షాలు, వరదలు నగరానికి కొత్తకాదని, చెరువులను ఆక్రమించుకోవడం తో పేదలకు తీవ్ర నష్టం వాటిళ్లుతోంద న్నారు. 1908 మొదలుపెట్టి 1920లో (ఉస్మాన్‌‌ సాగర్‌, హిమాయత్‌‌సాగర్‌) జంట జలాశయాలను నిజాం ప్రభువు కట్టారని, మూసాఈసా రెండు నదులు కలిస్తేనే జంట జలాశలు ఏర్పాడ్డాయని గుర్తు చేశారు. నిజాం మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేశారన్నారు.

100 ఏండ్ల క్రితమే మూసీ రివర్‌ ‌ఫ్రంట్‌‌ను ఏర్పాటు చేశారన్నా రు. నేడు మూసీతోపాటు కుంటలను, నాలాలను చెరువులను కబ్జాలు చేయడంతో హైదరాబాద్‌ ‌వాసులతోపాటు నల్గొండ, రంగారెడ్డి జిల్లా ప్రజలకు తీవ్రనష్టం వాటిల్లు తోందని, విషం నింపుతోందన్నారు. నల్గొండ లోని కొన్ని ప్రాంతాలల్లో అక్కడ పిల్లలకు పెండ్లీలు కావడం లేదని, దాంతో వారు ఇతర ప్రాంతాలకు వెళ్లి జీవనం సాగిస్తున్నారని గుర్తు చేశారు. నల్గొండలో ఓ పక్కా ఫ్లోరైడ్‌‌తో బాధపడుతుంటే, మరో పక్కా మూసీ మురుగుతో ఆ జిల్లాల వారికి నరకంగా మారిందన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా మూసీనీ ప్రక్షాళన చేస్తామన్నారు. హైదరాబాద్‌‌తోపాటు ఇతర ప్రాంతా లను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతోనే ముందుకెళ్తున్నామన్నామన్నారు. ఇందులో భాగంగా లేక్‌ ‌ప్రొటెక్షన్‌ ఫోర్సును ఏర్పాటు చేశామన్నారు. లేక్‌ ఏకానమి ఎక్కడ ఉందో అక్కడి నగరాలు, పట్టణలు అభివృద్ధి చెందు తాయన్నారు. గంగా, యమునా, గోదావరి, కృష్ణతోపాటు ఇతర నదుల పేర్లను తమ బిడ్డలకు పెట్టుకున్నారు. కానీ మూసీ పేరును ఎవరైనా పెట్టుకున్నారా అని ప్రశ్నించారు. నేడు చెత్తాచెదారంతోపాటు మూసీలో జంతువుల కళేబరాలు వేస్తున్నారన్నారు.

మూసీని అభివృద్ధి చేస్తామని, అభివృద్ధిలో అందరు భాగస్వాములు కావాలని కోరారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేద్దామని, ఇప్పుడు అభివృద్ధికోసం మాట్లాడు కుందామన్నారు. తమ్మిడికుంట చెరువుతో పాటు పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా మహిళలకు రక్షణ కల్పించాలన్నారు. హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌, ‌సైబరాబాద్‌ పోలీస్‌ ‌కమిషనర్‌ ‌రమేష్‌‌తోపాటు మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌ప్రత్యేక చర్యలు తీసుకుని అభివృద్ధి చేయాలన్నారు. జమ్మిచెట్టును ‌నాటాలని హైడ్రా కమిషనర్‌కు సీఎం సూచించారు. నేడు తమ్మిడికుంట చెరువు ఆహ్లాదకరంగా మారిందని ఇక్కడ పండుగలు సంతోషంగా జరుపుకోవచ్చారు. ఇదిలావుండగా రామంతాపూర్‌ చెరువు పునరుద్ధరణలో గుడిసెలను కోల్పోయిన వారి కి ఇందిరమ్మ ఇండ్లను సీఎం అందించారు. ​చెరువును చూసి చాలా బాధ కలిగింది తమ్మిడికుంట చెరువును చూసి చాలా బాధ కలిగిందని సినీనటుడు అక్కినేని నాగార్జున అన్నారు. ఇతర దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి లేక్స్ చూసి మనం ఎందుకు చేయడం లేదు అనిపించేదని, తమ్మిడికుంట అభివృద్ధిని చూసి మనమూ చేయవచ్చని నిరూపించారన్నారు.

ఇందులో ముఖ్యమంత్రి సంకల్పం కనిపిస్తుందని, రంగనాథ్‌ను కలిసినప్పుడు తన ఆలోచన వేరేగా ఉండేదన్నారు. దాన్ని మార్చి తమ్మిడికుంటను అద్భుతంగా తీర్చిదిద్దారని రంగనాథ్‌‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎన్ని విమర్శలు వచ్చినా రంగనాథ్‌ ఎంతో కష్టపడుతున్నారన్నారు. తమ్మిడికుంట వద్ద డ్యాన్స్ చేయలేను కానీ షూటింగ్ చేస్తానని, మన పిల్లలకు ఇచ్చే ఆస్తి ప్రకృతేనని, మూసీ నది పునర్జీవన ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి కూడా తనను పిలుస్తారని భావిస్తున్నానని అన్నారు. నగరంలోని 2000లేక్స్‌‌ను (పునరుద్ధరణ) అభివృద్ధి చేయాలని కోరారు. మన నగరాన్ని మనం రక్షించుకుందామని, సీఎం చేస్తున్న పనులు చాలా బాగున్నాయని, మనం ప్రకృతిని కాపాడితే అది మనలను కాపాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హైడ్రాకమిషనర్‌ ఏవీ రంగనాథ్‌‌, వాటర్‌‌ వర్క్స్‌ ఎండీ అశోక్‌‌రెడ్డితోపాటు మాజీ మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పోలీసులు, మున్సిపల్‌ అధికారులు, కార్పొరేషన్‌ ‌చైర్మెన్లను ప్రముఖ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


చెరువుల పునరుద్ధరణకు ప్రజల మద్దతు : రంగనాథ్‌

చెరువుల పునరుద్ధరణకు సీఎం ఎంతో సహాయసహకారం అందిస్తున్నా రని హైడ్రాకమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ ‌తెలిపారు. హైడ్రా చేస్తున్న చెరువుల పునరుజ్జీవనానికి యువతతోపాటు ప్రజలు పూర్తి మద్ధతు ఇస్తున్నారని తెలిపారు. గుజరాత్‌‌లో సబర్మతిని ఎలా అభివృద్ధి చేశారో, అదే తరహాలో మూసీనీ అభివృద్ధి చేయాలని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ ‌రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ర్టంలో మరిన్ని అభివృద్ధి పనులు చేయాలని, అందుకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. తమ్మిడికుంట చెరువుతో లైఫ్‌‌లాంగ్‌ ‌పండగవచ్చిందని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తెలిపారు. మొదట్లో హైడ్రాపై తప్పుడు ప్రచారం చేశారు, కానీ హైడ్రా పనితీరుతో ఇది కలానిజమా అనిపించింద న్నారు. హైడ్రా పనితీరుతో ప్రభుత్వానికి మంచిపేరు వస్తోందన్నారు. 14ఎకరాల చెరువును 30 ఎకరాలు చేశారన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా సీఎం వాటిని పట్టించుకోకుండా నాలాలు, చెరువులను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. మరిన్ని చెరువులను అభివృద్ధిచేయాలని, తమ వంతుగా పూర్తి సహకారం అందిస్తామ న్నారు. సైబరాబాద్‌‌లో పోలీసులు సైతం బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. కష్టపడితేనే అభివృద్ధిసాధ్యమని, పార్టీలకు అతీతంగా ముందుకెళ్దామని కోరారు. ‌

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్