కేటీఆర్, హరీశ్‌రావుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో అవగాహన లేకుండా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యే హరీశ్ రావులు భ్రమలో ఉన్నారని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని సచివాలయం వద్ద ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వంద సీట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి పూర్తి స్వేచ్ఛనిచ్చారనీ, తమ మధ్య దేశంలో ఎక్కడా లేనంత సమన్వయం ఉందని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజల్లో చురుకుగా తిరుగుతున్నారని చెప్పారు. సంక్షేమ పథకాలు పొందిన వారంతా కాంగ్రెస్ కే ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత కరెంట్, 90 వేల ఉద్యోగాలను ఇచ్చినట్టు తెలిపారు. బీజేపీ పని అయిపోయిందనీ, 8 ఎంపీ స్థానాల్లో రెండు వస్తే ఎక్కువనీ, ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా రాదని అన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 40 ఎమ్మెల్యే స్థానాలను కాంగ్రెస్ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు.






కామెంట్లు (0)