నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ శనివారం హైదరాబాద్‌కు రానున్నారు. నగరంలోని హైటెక్స్‌లో కొనసాగుతున్న భారత్ సమ్మిట్ -2.0 ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఇక్కడకు విచ్చేస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పలువురు జాతీయ నాయకులు కూడా ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్నారు. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన విధానాన్ని రాహుల్ గాంధీ ఆష్కరించనున్నారు. ఈ సందర్భంగా ఆయన శనివారం ఉదయం 9.30 గంటలకు శిల్పారామంలోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి మీనాక్షి టవర్స్ గ్రౌండ్స్ వరకు గిగ్ వర్కర్లు నిర్వహించే ర్యాలీలో పాల్గొంటారు.





కామెంట్‌లు (0)