Magazines

15 రోజుల ఖర్చుతో నెలరోజుల ప్రయాణం

18 నిమిషాల క్రితం

trip
avatar
balaji

ప్రచురించబడింది నవం 13, 2026 | 2 నిమిషాల చదవడం

మహిళలకు భారీ డిస్కౌంట్

ప్రయాణికులకు 
ఆర్టీసీ బంపర్ ఆఫర్

తొమ్మిది రకాల బస్‌‌పాస్‌ రాయితీలు


నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రోజువారీ బస్సు ప్రయాణాన్ని మరింత పొదుపుగా, సులభంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) ప్రయాణికులకు భారీ శుభవార్త అందించింది. సంస్థ తమ నెలవారీ సీజన్ టికెట్ ) పథకం కింద తొమ్మిది అదనపు సౌకర్యాలతోపాటు ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. ఈ సవరించిన నిబంధనలు శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, నిత్య ప్రయాణికులకు ఈ నిర్ణయం ఆర్థికంగా ఎంతో ఊరటనివ్వనుంది. కొత్త విధానం ప్రకారం మంత్లీ సీజన్ టికెట్ల జారీకి ఇప్పటివరకు ఉన్న దూర పరిమితిని టీజీఎస్ ఆర్టీసీ పూర్తిగా తొలగించింది. నిర్దేశించిన రూట్, ఛార్జీల నిబంధనలకు లోబడి, ప్రయాణికులు ఇకపై ఎలాంటి దూర పరిమితి లేకుండా నెలవారీ సీజన్ టికెట్లను పొందవచ్చు. పాస్ ధరలను మరింత తగ్గించే క్రమంలో టోల్ ప్లాజా ఛార్జీలను ప్రస్తుతం ఉన్న 25 రోజులకు బదులుగా కేవలం 20 రోజులకు మాత్రమే లెక్కించనున్నారు.

అంతేకాకుండా, సాధారణ ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ ఎంపికను అందించేందుకు డీలక్స్ నెలవారీ సీజన్ టికెట్లను టీజీఎస్ ఆర్టీసీ ప్రవేశపెడుతున్నది. ఈ పాస్‌లు 'ఇ-డీలక్స్' సర్వీసులలో ప్రయాణానికి కూడా చెల్లుబాటు అవుతాయి. ఇక నెలవారీ సీజన్ టికెట్ హోల్డర్లకు ప్రత్యేక ప్రయోజనంగా హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్ నగరాల్లో నడిచే అన్ని కేటగిరీల సిటీ బస్సు సర్వీసులలో ఆదివారాల్లో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును కల్పించారు. అయితే, ఈ సౌకర్యం గ్రేటర్ హైదరాబాద్ జోన్‌ పరిధిలోని పుష్పక్ ఎయిర్‌పోర్ట్ లైనర్ సర్వీసులకు, ఇతర ప్రభుత్వ సెలవు దినాలకు వర్తించదు. అదేవిధంగా ప్రయాణ సౌలభ్యం కోసం 'కాంబి టికెట్' సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. దీని కింద ప్రతి ప్రయాణానికి అదనంగా రూ. 20 చెల్లించి కాంబి టికెట్ తీసుకోవడం ద్వారా పల్లెవెలుగు మంత్లీ సీజన్ టికెట్ హోల్డర్స్ ఎక్స్‌ప్రెస్, ఇ-ఎక్స్‌ప్రెస్ బస్సులలోనూ, అలాగే ఎక్స్‌ప్రెస్ ఎంఎస్‌టీ హోల్డర్లు డీలక్స్ తోపాటు ఇ-డీలక్స్ బస్సులలోనూ ప్రయాణించవచ్చు. అయితే పల్లెవెలుగు పాస్‌దారులకు డీలక్స్ లేదా ఇ-డీలక్స్ బస్సులలో అనుమతి ఉండదు. అ

దనంగా, తమకు నిర్దేశించిన రూట్ కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని ఇతర మార్గాల్లో ప్రయాణించే సీజన్ టికెట్ హోల్డర్లకు సూపర్ లగ్జరీ, అంతకంటే పైస్థాయి కేటగిరీ బస్సుల బేసిక్ టికెట్ ఛార్జీపై 10 శాతం ప్రత్యేక తగ్గింపు లభిస్తుంది. దీర్ఘకాలిక పాస్‌లు తీసుకునే వారికి ప్రోత్సాహకంగా, రెండు నెలల సీజన్ టికెట్ కొనుగోలు చేసే ప్రయాణికులకు ఎటువంటి అదనపు రుసుము లేకుండా అదనంగా 5 రోజుల వ్యాలిడిటీని, మూడు నెలల సీజన్ టికెట్ తీసుకునే వారికి అదనంగా 10 రోజుల వ్యాలిడిటీని సంస్థ కల్పిస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా మహిళా ప్రయాణికులలో సీజన్ టికెట్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక రాయితీని ప్రవేశపెట్టింది. దీని కింద టోల్ ఛార్జీలతో సహా సీజన్ టికెట్ ఛార్జీలను ప్రస్తుతం ఉన్న 20 రోజులకు బదులుగా కేవలం 15 రోజులకు మాత్రమే లెక్కించనుండటంతో మహిళలకు భారీగా డబ్బు ఆదా కానుంది."టీజీఎస్ ఆర్టీసీతో ప్రయాణించండి - మరింత ఆదా చేయండి" అనే నినాదంతో తీసుకొచ్చిన ఈ నూతన సౌకర్యాలను విద్యార్థులు, ఉద్యోగులతొనాటు ప్రతిరోజూ బస్సుల్లో ప్రయాణించే వారంగా గరిష్టంగా సద్వినియోగం చేసుకోవాలని సంస్థ కోరుతోంది. ఈ సౌకర్యాలు శనివారం నుంచి అమల్లోకి రానున్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్