Magazines

ఇన్ముల్నర్వ ప్లాట్ల 
ఈ-వేలం ప్రీ-బిడ్‌కు స్పందన

34 నిమిషాల క్రితం

Response to the Pre-bid for E-auction of 'Invulnerable' Plots
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 2 నిమిషాల చదవడం

45 నివాస ప్లాట్లు విక్రయానికి సిద్ధం

ఈనెల 21తో ముగియనున్న రిజిస్ట్రేషన్ల గడువు.. 
23న ఈ-వేలం రవాణా వసతులు, చెల్లింపులపై బిడ్డర్లకు అవగాహన

సందేహాలను నివృత్తి చేసిన అధికారులు

నవతెలంగాణ-సిటీబ్యూరో

ఇన్ముల్నర్వ లేఅవుట్‌లోని 45 నివాస ప్లాట్ల ఈ-వేలానికి సంబంధించి హెచ్‌ఎండీఏ శుక్రవారం నిర్వహించిన ప్రీ-బిడ్ సమావేశానికి ఔత్సాహిక బిడ్డర్ల నుంచి విశేష స్పందన లభించింది. ప్లాట్లను కొనుగోలు చేసేందుకు పలువురు ఆసక్తి కనబరిచారు. హెచ్‌ఎండీఏ ఈఈ దన్మోహన్ సింగ్, తహసీల్దార్ వైటి. వెంకటేశ్వర్లు, డీఈఈ అభిలాష్, ఏఈఈ శ్రవణ్ పాల్గొన్న ఈ సమావేశంలో బిడ్డర్లు అడిగిన పలు సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. ఈ సందర్భంగా హెచ్‌ఎండీఏ లావాదేవీల సలహాదారు సంస్థ కేపీఎంజీ ప్రతినిధి కల్యాణ్.. ఇన్ముల్నర్వ లేఅవుట్‌కు ఉన్న రోడ్డు కనెక్టివిటీ, కల్పించిన మౌలిక సదుపాయాలు, పరిసర ప్రాంతాల్లో భవిష్యత్‌లో అభివృద్ధి అవకాశాలపై సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ, పాల్గొనే పద్ధతులను ఎంఎస్‌టీసీ లిమిటెడ్‌ ప్రతినిధి దినేష్ వివరించారు. ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ), బిడ్డింగ్ నిబంధనలు, చెల్లింపు గడువులపై బిడ్డర్లకు అధికారులు పూర్తి స్పష్టతనిచ్చారు.

​ఈనెల 23న ఈ-వేలం

ఈ ప్లాట్లకు 23న ఈ-వేలం నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. వేలంలో పాల్గొనాలనుకునే వారు 21వ తేదీ లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం హెచ్‌ఎండీఏ అధికారిక వెబ్‌సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.హెచ్‌ఎండీఏ.గౌ.ఇన్‌ను చూడొచ్చని, సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్ 7416835522 ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

హెచ్‌ఎండీఏ భూముల ఈ-వేలం ప్రీ-బిడ్‌ సమావేశంలో మార్పు

హెచ్‌ఎండీఏ పరిధిలోని పలు కీలక ప్రాంతాల్లోని ప్లాట్ల ఈ-వేలానికి సంబంధించిన ‘ప్రీ-బిడ్’ సమావేశం తేదీలో మార్పు జరిగింది. పరిపాలనా కారణాల దృష్ట్యా తొలుత నిర్ణయించిన ఈనెల 18వ తేదీకి బదులుగా, ఒకరోజు ముందుగానే అంటే 17వ తేదీన నిర్వహించనున్నట్టు హెచ్‌ఎండీఏ ఎస్టేట్ మేనేజ్‌మెంట్ విభాగం శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. హుడా హైట్స్ లేఅవుట్.. షేక్‌పేట్ మండలం హకీంపేట్ (సర్వే నెం. 102/1), నియోపోలిస్ లేఅవుట్.. కోకాపేట్ (ప్లాట్ నెం. 17, సర్వే నెం. 239, 240), మూసాపేట్ భూమి.. కూకట్‌పల్లి మండలం మూసాపేట్ (ప్లాట్ నెం. 1, సర్వే నెంబర్లు 121/P నుంచి 141, 146, 147, 155 నుంచి 157), ప్రాంతాల్లోని ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి గల బిడ్డర్లు మారిన ప్రీ-బిడ్ సమావేశం తేదీని గమనించి పాల్గొనాలని అధికారులు సూచించారు. ఈ తేదీ మార్పు కేవలం ప్రీ-బిడ్ సమావేశానికి మాత్రమేనని, నోటిఫికేషన్‌లో పేర్కొన్న అసలు ఈ-వేలం తేదీలు, రిజిస్ట్రేషన్, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ) చెల్లింపు తుది గడువుల్లో ఎలాంటి మార్పూ లేదని స్పష్టం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్