Magazines

రాజేంద్రనగర్‌‌లో భారీ పేలుళ్ల శబ్దాలు

57 నిమిషాల క్రితం

Rajendranagar
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 1 నిమిషాల చదవడం

భూకంపమా లేక భూమి లోపల భౌగోళిక కారణాలా?
ఇండ్లలో నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు


నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలో మంగళవారం ఉదయం పేలుళ్ల శబ్దాలు తీవ్ర కలకలం రేపాయి. ఎర్రబోడ, ఉప్పరపల్లి, అత్తాపూర్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో ఉదయం తొమ్మిది నుంచి 9.30 గంటల మధ్యలో భూమిలో నుంచి పెద్ద శబ్దాలు రావడంతో స్థానికులు ఇండ్లలో నుంచి భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. సుమారు రెండు సెకండ్ల పాటు ఆ శబ్దాలు వచ్చాయి. దీంతో స్థానికులు ఏం జరుగుతుందో అని ఒక్కసారిగా షాక్‌‌కు గురయ్యారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ వెంకటేష్ శబ్దాలు వచ్చిన నాలుగు ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎర్రబోడ ప్రాంతాల్లో సీసీ కెమెరాలో రికార్టయిన దృశ్యాల ప్రకారం 9 గంటల 14 నిమిషాలకు ఒక భారీ శబ్దం వచ్చిందని చెప్పారు. అయితే సమీపంలో ఎక్క‌డా కన్‌‌స్ర్టక్షన్‌ కూడా జరగడం లేదని, ఇది భూకంపమా లేక ఇతర ఏ కారణాలతో శబ్దం వచ్చిందో సంబంధిత అధికారులు విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ప్రజలు ఈ శబ్దాల మీద ఎలాంటి వదంతులు, పుకార్లు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్