డీలిమిటేషన్తో సంబంధం లేకుండా మహిళా బిల్లు అమలు చేయాలి
లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా జరిగే చలో ఢిల్లీకి మద్దతు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
నవ తెలంగాణ -మహబూబ్ నగర్ ప్రాంతీయ ప్రతినిధి
‘‘వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది.. అందుకే ఒకవైపు సర్ పేరుతో ఓట్లు తొలగించి అప్రజాస్యామికంగా వ్యవహరిస్తూ.. నేడు డీలిమిటేషన్ తీసుకురావడానికి విశ్వ ప్రయ త్నాలు చేస్తోంది.. దీనికి పార్లమెంట్ లో ఎప్పుడో ఆమోదం పొందిన మహిళా బిల్లుకు లింకు పెడుతోంది.. ఇది ఆమోదయోగ్యం కాదు.. డీలిమిటేషన్తో సంబంధం లేకుండా మహిళా బిల్లును అమలు చేయాలి’’ అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వనపర్తి పట్టణంలో శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. బీజేపీకి బలంగా ఉన్న రాష్ట్రాల్లో పార్లమెంట్ సీట్లను పెంచుకోవడానికి జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో అధిక జనాభా ఉన్నందువల్ల ఎక్కువ సీట్లు గెలిపించుకొని మరోసారి గద్దెనెక్కడ ానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇప్పుడున్న పార్లమెంటు సీట్లలోనే 33 శాతం మహిళలకు ఇస్తే ఏమవు తుందని ప్రశ్నించారు. డీలిమిటే షన్ అమలు కోసం పార్లమెంటులో అనుకూలమైన వాతావరణాన్ని తీసుకురావడానికి బీజేపీ నాయకు లు అనేక పార్టీల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తృణమూల్, ఎన్సీపీ, శివసేన లాంటి పార్టీలను చీల్చి పార్లమెంటులో తమకు అనుకూలం గా మార్చుకోవడం అప్రజాస్వామిక మన్నారు. బీజేపీ నయా ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు, ప్రజలు, మేధావులు, ప్రజాసంఘాలు గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.
కేంద్రం రూ.50 వేల కోట్లు ఇవ్వాలి
మొదటి నుంచీ తెలంగాణ కరువు ప్రాంతమని, ఇప్పుడు ఎల్ నినో ప్రభావంతో మరింత కుదేలవుతోందని జాన్వెస్లీ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారిక లెక్క ప్రకారమే 25 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, లక్షల బోరు బావులు ఎండిపోయాయని తెలిపా రు. జాతీయ విపత్తుగా భావించి కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి రూ.50 వేల కోట్లు అందించి సహకరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులున్నారని, ఎనిమిది మంది ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని ఏమాత్రం ఆదుకోవడం లేదని చెప్పారు. కానీ, రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ రావాలని చెబుతున్నారని, మరి కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండి రాష్ర్టానికి ఏం ఒరగబెట్టిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉపాధి రంగానికి సంబంధించిన బడ్జెట్లో 90 శాతం నిధులు కేంద్ర మే భరించాలన్నారు. ఎకరాకు వరి సాగు చేసిన రైతులకు రూ.30,000 ,వాణిజ్య పంటలకు రూ.50,000 పరిహారంగా కేంద్ర ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతాంగానికి కోతలు లేని నాణ్యమైన విద్యుత్ కోరారు. వ్యవసాయ కూలీలకు పది వేల ఆర్థిక సహాయం, మహిళలకు నెలకు రూ.2500, విద్యార్థినులకు స్కూటీలు, అర్హులందరికీ పింఛన్లు అందించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమానికి సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతిస్తుందని ప్రకటించారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, కార్యదర్శివర్గ సభ్యులు జబ్బార్, బాల్ రెడ్డి , జిఎస్.గోపి, ఎం.రాజు, నాయకులు ఆర్యన్ రమేష్, బి.వెంకటేష్, ఎస్.రాజు, వెంకట్ రాములు, గుంటి వెంకటయ్య, మహబూబ్ పాషా, బాల్యా నాయక్ ఉన్నారు.






కామెంట్లు (0)