Magazines

ప్రజల గొంతుకనవుతా

11 నిమిషాల క్రితం

voice
avatar
balaji

ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం

పీడీఎఫ్ అభ్యర్థి కొల్లి సత్యనారాయణ.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి అనూహ్య స్పందన

ఎమ్మెల్సీగా గెలిపిస్తామని ఉద్యోగులు, నిరుద్యోగులు, మేధావులు, డాక్టర్లు, గ్రాడ్యుయేట్ల భరోసా

లకారం, గొరిల్లా పార్కుల్లో వాకర్లతో మమేకమై ప్రచారం


నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
పీడీఎఫ్ అభ్యర్థి కొల్లి సత్యనారాయణ ఎన్నికల ప్రచారానికి అనూహ్య స్పందన లభిస్తోంది. ఎక్కడికి వెళ్లినా ఉద్యోగులు, నిరుద్యోగులు, మేధావులు, డాక్టర్లు, గ్రాడ్యుయేట్లు సాదరంగా స్వాగతం పలికి, కొల్లిని గెలిపిస్తామని భరోసా ఇస్తున్నారు. ప్రచారంలో భాగంగా బుధవారం కొల్లి సత్యనారాయణ ఖమ్మంలోని లకారం పార్క్, గొరిల్లా పార్కుల్లో వాకర్లను కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్లను కలిసి తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి, శాసన మండలికి పంపించాలని ఆయన అభ్యర్థించారు. తనను ఆశీర్వదించి, గెలిపించి శాసన మండలికి పంపిస్తే పేదలు, బడుగు బలహీన వర్గాలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మేధావులు, డాక్టర్లు, లాయర్లు, గ్రాడ్యుయేట్ల గొంతుకనై వాదిస్తానన్నారు. పేదల కష్టాలు, కన్నీళ్ళ పై గళమెత్తుతానని చెప్పారు.


ప్రజల వాణిని బలంగా వినిపించి సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. పోరాట యోధుల స్ఫూర్తితో పని చేస్తానని అన్నారు. ప్రగతిశీల శక్తులంతా గెలుపునకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ఖమ్మం జిల్లా కార్యదర్శి పుల్లయ్య, నాయకులు ఆవుల అశోక్, నామాల ఆజాద్, రాష్ట్ర మహిళా సంఘం నాయకురాలు ఝాన్సీ, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాదినేని రమేష్, సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు బండి రమేష్, ఎస్ఎఫ్ఐ మాజీ విద్యార్థుల కన్వీనర్ ఎం. సుబ్బారావు, బండారు రమేష్, చెరుకుమల్లి కుటుంబరావు, న్యాయవాదులు ఏడునూతల శ్రీనివాసరావు, తన్నీరు పాపయ్య, బ్రహ్మంతో పాటు బోడపట్ల రవీందర్, డాక్టర్లు రవీంద్రనాధ్, భారవి, గ్రానైట్ అసోసియేషన్ నాయకులు వాసిరెడ్డి రవికుమార్, పాల్గొన్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్