Magazines

ఇది ప్రజాపాలన కాదు
అవినీతి పాలన

1 గంట క్రితం

administration
avatar
balaji

ప్రచురించబడింది నవం 20, 2026 | 2 నిమిషాల చదవడం

20 శాతం కమీషన్‌ లేనిదే పనులు కావడం లేదు

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు 
అనిరుధ్‌‌రెడ్డి, రాజగోపాల్‌‌రెడ్డి 
వ్యాఖ్యలే నిదర్శనం

రూ.4 వేల పెన్షన్‌ ఏమైంది?

ఢిల్లీకి గులాముల్లా హస్తం, కమలం పార్టీ నేతలు : బీఆర్‌ఎస్‌
 వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌


నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌

ఇది ప్రజా పాలన కాదనీ, అవినీతి పాలన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో 20 శాతం కమీషన్ ‌లేనిదే పనులు కావడం లేదంటూ స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలే చెబుతున్నారన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే‌లు అనిరుధ్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డి ప్రభుత్వ అవినీతిపై చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని అన్నారు. గురువారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌‌లో భూపాలపల్లి నుంచి బీఆర్ఎస్‌లో భారీ చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి కేటీఆర్‌ ఆహ్వానిం‌చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్సంటేజీ ఇవ్వనిదే పనులు జరగడం లేదంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారని గుర్తు చేశారు. రూ.ఐదు లక్షల కోట్ల దోపిడీ, టెండర్లలో అవినీతి, కుంభకోణాల ఆరోపణలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేశారని గుర్తుచేశారు. రానున్న రోజుల్లో మరిన్ని కుంభకోణాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.

​వచ్చేది బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వమే

అవినీతి సొమ్ముతో ఓటుకు రూ.15 వేలు పంచితే ప్రజలు ఓటు వేస్తారనే భ్రమలో ముఖ్యమంత్రి ఉన్నారని కేటీఆర్ అన్నారు. ఏడాది తర్వాత వచ్చేది గులాబీ జెండాయేనని దీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత రాబోయే రోజుల్లో బీఆర్ఎస్‌కు బలంగా మారుతుందన్నారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నాయకులు తిన్న అవినీతి సొమ్మును కక్కిస్తామని చెప్పారు. అవినీతికి పాల్పడిన వారిలో ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

​పెన్షన్లలో 4.70 లక్షల కోతలు

పెన్షన్లలో 4.70 లక్షల కోతలు విధించి, కొత్త పించన్లు ఇస్తున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తున్నదని కేటీఆర్‌ ‌విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో 44.70 లక్షల పెన్షన్లు ఉండేవని వివరించారు. కాంగ్రెస్ వచ్చాక మొదటి ఏడాది 1.50 లక్షలు, రెండో ఏడాది మరో 1.50 లక్షలు, మూడో ఏడాది 1.70 లక్షల పెన్షన్లు కలిపి 4.70 లక్షల పెన్షన్లకు కోత పెట్టిందని విమర్శించారు. కొత్తగా 4.63 లక్షల పెన్షన్లు మంజూరు చేసినట్టు ప్రచారం చేస్తున్నదన్నారు. తొలగించిన పెన్షన్లతో పోలిస్తే కొత్తగా ఇచ్చినవి ఏడు వేలు తక్కువేవని వివరించారు. ఎన్నికల సమయంలో పెన్షన్‌ను రూ.నాలుగు వేలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, మూడేండ్లు గడిచినా రూ.రెండు వేలు మాత్రమే ఇస్తున్నారని, ఆ హామీ ఏమైందనీ ప్రశ్నించారు.

తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీకి తాకట్టు

కాంగ్రెస్, బీజేపీ నాయకులు తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రశ్నించకుండా ఢిల్లీ పార్టీలకు బాడీగార్డుల్లా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టారని అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు ఢిల్లీకి గులాముల్లా పనిచేస్తున్నారని చెప్పారు. ఢిల్లీ నాయకులు రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి వణికిపోతున్నారనీ, ప్రియాంక గాంధీ వచ్చినప్పుడు బాడీగార్డులా పక్కకు వెళ్లారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో బైక్‌పై వెళ్తుంటే పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, మంత్రి వివేక్ వెంకటస్వామి వెనుక పరుగులు తీశారని విమర్శిం చారు.బీజేపీలోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. అమిత్‌షా హైదరాబాద్‌కు వచ్చిన ప్పుడు రాంచందర్‌రావు ఆయన కాళ్లు మొ‌క్కారనీ, కేంద్రమంత్రి బండి సంజయ్‌ ‌చెప్పులు మోశారని విమర్శించారు. ఢిల్లీ పెద్దలకు ఈఎంఐలు కట్టకపోతే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోతుందని ఎద్దేవా చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్