Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్పోలీస్ బెటాలియన్ లో రాష్ట్ర అవతరణ వేడుకలు

పోలీస్ బెటాలియన్ లో రాష్ట్ర అవతరణ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 17వ పోలీస్ బెటాలియన్ లో సోమవారం బెటాలియన్ కమాండెంట్ సురేష్ జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా బెటాలియన్ కమాండెంట్  సురేష్  మాట్లాడుతూ  తెలంగాణ ప్రజలు కన్న కలలు సాకారం అయిన రోజు అని, ఎంతో మంది తెలంగాణ అమరవీరుల త్యాగఫలంతో, ఉద్యమకారుల పోరాటంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. నీళ్లు, నిధులు, నియమాకాల నినాదంతో దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 1969లో తొలిదశ ఉద్యమం తీవ్రస్థాయికి చేరింది. ఓయూలో విద్యార్థుల పోరాటం, కొందరు ఉద్యమకారుల మరణంతో ఉద్యమం ఉవ్వెత్తున పైకి లేచింది. తర్వాత మరుగునపడిపోయింది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి గొంతెత్తి నినాదించారు. జయశంకర్, కొండ లక్ష్మణ్ బాపూజీలాంటి మహా వ్యక్తులు తెలంగాణ రాష్ట్రం కోసం కృషి  చేశారని వారి కృషి ఫలితంగా తెలంగాణా రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా విధులలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్   ప్రమీల,  అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad