Monday, May 19, 2025
Homeజిల్లాలుభువనగిరిలో కా.పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహావిష్కరణ..

భువనగిరిలో కా.పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహావిష్కరణ..

- Advertisement -

హాజరుకానున్న సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ..
కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య..
కేంద్ర కమిటీ మాజీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ – భువనగిరి
: కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, కమ్యూనిస్టు గాంధీగా పేరొందిన సుందరయ్య తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖులు పుచ్చలపల్లి సుందరయ్య. ఆయన స్మారకార్థం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రమైన భువనగిరిలోని సీపీఐ(ఎం) కార్యాలయం సుందరయ్య భవన్లో సుందరయ్య విగ్రహావిష్కరణ నిర్వహించనున్నారు. పేదల పక్షాన నిలబడి పోరాటం చేసి ఉద్యమాలు నడిపిన అమరవీరుల కుటుంబాల ఆత్మీయ సభ నిర్వహించనున్నారు. ముఖ్య అతిథులుగా సీపీఐ(ఎం) పొలిటి బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య, మాజీ కేంద్ర కమిటీ సభ్యులు సీతారాములు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా 11 గంటలకు డాగ్ బంగ్లాలో  ప్రెస్ మీట్ ఉంటుంది. అనంతరం 12 గంటలకు సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయం సుందరయ్య భవన్లో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య విగ్రష్కరణ, అమరవీరుల కుటుంబాల ఆత్మీయ సభ నిర్వహించనున్నారు. 
కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య..
పుచ్చలపల్లి సుందరయ్య (1913 – 1985) ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు. కమ్యూనిస్టు గాంధీగా పేరొందిన సుందరయ్య తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖులు. 1913 మే 1న కృష్ణాజిల్లా కొవ్వూరు తాలూకా అలగానిపాడులో జన్మించారు. ఆయన తన విద్యను రాజమండ్రి, మద్రాసులలో పూర్తి చేశారు. 1928లో సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమంలో పాల్గొన్నారు. సుందరయ్య పశ్చిమగోదావరిలో నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నారు. రష్యా, రోమ్, యునైటెడ్ కింగ్డమ్, కైరో తదితర దేశాలను సందర్శించారు.1946లో విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే పుస్తకాన్ని రచించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆయన చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. కమ్యూనిస్టు పార్టీకి నాయకత్వం వహించారు. కులవ్యవస్థను నిరసించిన ఇతను అసలు పేరు పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి లోని రెడ్డి అనే కులసూచికను తొలగించుకున్నారు. సహచరులు ఇతనును “కామ్రేడ్ పి.ఎస్.” అని పిలిచేవారు. ఆయన నిరాడంబరతతో ఆదర్శ జీవితం గడిపారు. స్వాతంత్ర్య సమరంలోని అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. సుందరయ్య భార్య లీలావతి సీపీఐ – ఎంలోని ముఖ్య నాయకురాలు. తెలంగాణ ప్రజల పోరాటం – దాని పాఠాలు, విశాలాంధ్రలో ప్రజారాజ్యం వంటి పుస్తకాలు, నివేదికలు రాశాడు. పార్లమెంటు సభ్యునిగా సుదీర్ఘ కాలం పనిచేశాడు. ఆ సమయంలో పార్లమెంటుకు సైకిల్ మీద వెళ్ళేవారు. పార్లమెంటు  భవనంలో చెప్రాసీల  సైకిళ్లతో పాటు ఇతని సైకిల్ కూడా స్టాండ్ లో ఉండేది.  రాష్ట్ర విధాన సభలో అదే సైకిల్ ను ఉపయోగించారు.  కామ్రేడ్ లీలావతి పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం కలిగితే తన ప్రజాసేవకు ఆ బంధాలు, బాంధవ్యాలు అడ్డు తలుగుతాయని, పెండ్లి కాగానే కుటుంబ నియంత్రణ చికిత్స చేయించుకున్నారు. తండ్రి నుంచి వచ్చిన వంశపార్యం పరంగా లభించిన ఆస్తిని నిరుపేద ప్రజలకు పంచివేశారు. 1985 మే 19న మద్రాస్ లోని అపోలో ఆస్పత్రిలో పుచ్చలపల్లి అమరుడయ్యారు. 
ఉద్యమ కేంద్రముగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం.. 
భూమి కోసం, భుక్తి కోసం, ప్రజల విముక్తి కోసం నాడు పెద్ద ఎత్తున నిర్వహించిన తెలంగాణ రైతాంగ సాయుధ విప్లవ పోరాటానికి నాంది పలికిన యాదాద్రి భువనగిరి జిల్లా. నాటి నుండి అణగారిన ప్రజల కొండగా నిలబడి సీపీఐ(ఎం) అలుపెరుగని అనేక పోరాటాలు నిర్వహించింది.  చిన్న అద్దె గదిలో ప్రారంభమైన సీపీఐ(ఎం) కార్యాలయం విశాలమైన సొంత భవనంలోకి 1990 దశకంలో మారింది. యాదాద్రి భువనగిరి నూతన జిల్లా ఏర్పడ్డ తర్వాత ఆ సొంత భవనంలోనే గ్రంథాలయం, ఉచితముగా స్పోకెన్ ఇంగ్లీష్, కరాటే, చిత్రకళ ఇతర సామాజిక కార్యక్రమాలు సీపీఐ(ఎం) జిల్లా కమిటీ నిర్వహిస్తూ ముందుకు పోతుంది. దుంపల మల్లారెడ్డి స్మారక భవనాన్ని నిర్మించి నేడు ఉద్యమ పోరాటాల సభలకు కేంద్రమైంది. సీపీఐ(ఎం)తో పాటు ఇతర ప్రజా సంఘాలు, కమిటీలు సమావేశం నిర్వహించుకుంటున్నాయి. ఆదాయం సమకూర్చేందుకు ఐదు మడిగలు నిర్మించి అద్దెకిచ్చారు. 
విజయవంతం చేయండి..
సాయుధ రైతాంగ విప్లవ పోరాట యోధుడు స్వతంత్ర సమరయోధులు సీపీఐ(ఎం) నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహావిష్కరణ సోమవారం స్థానిక సుందరయ్య భవన్లో, అమరవీరుల కుటుంబాల ఆత్మీయ సభను విజయవంతం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ విజ్ఞప్తి చేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -