- Advertisement -
- – హాజరుకానున్న మంత్రి పొన్నం ప్రభాకర్ వీప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజక వర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డిలు
– అట్టడుగు ప్రజల ఆశాకిరణం మహాత్మ జ్యోతిబాపూలే
– జ్యోతిబాపూలే దంపతుల విగ్రహావిష్కరణ కార్యక్రమం జయప్రదం చేయండి
– బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హన్మాండ్లు
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల - అట్టడుగు ప్రజల ఆశాకిరణం మహాత్మ జ్యోతిబాపూలే అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హన్మాండ్లు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీసీ భవనంలో ఆదివారం రోజున పర్ష హన్మాండ్లు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పర్ష హన్మాండ్లు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం వద్ద ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిబాపూలే దంపతుల విగ్రహాల ఆవిష్కరణ ఈనెల 26 న మంగళవారం రోజున ఉన్నదని బీసీ సంక్షేమ సంఘం నాయకులు, శ్రేణులు ,బీసీ కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పర్ష హన్మాండ్లు పిలుపునిచ్చారు, మహాత్మ జ్యోతిబాపూలే దంపతుల విగ్రహావిష్కరణలో బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డిలు పాల్గొంటారని పర్ష హన్మాండ్లు అన్నారు.
- మహాత్మ జ్యోతిబాపూలే దంపతులు అణగారిన వర్గాల కొరకు అనేకమైన త్యాగాలు చేశారని అవమానాలు ఎదుర్కొన్నారని దాడులకు గురైనారని అయినా ధైర్యంతో ఆ ప్రజల చైతన్యానికి విద్యావ్యాప్తికి ఎంతో కృషి చేశారని పర్ష హనుమాండ్లు అన్నారు, అటువంటి మహనీయుల విగ్రహావిష్కరణలో బాధ్యతగా బీసీ శ్రేణులు పాల్గొనాలని ఈ సందర్భంగా పర్ష హన్మాండ్లు కోరారు, ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు తడుక కమలాకర్, కోడం రవీందర్ ,చొక్కి కైలాసం, కూర ఆంజనేయులు, బోయిన శ్రీనివాస్, ఇల్లంతకుంట తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -