లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని 558 ఎయిడెడ్ మదరసాలపై ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) చేపట్టిన దర్యాప్తుపై అలహాబాద్ హైకోర్టు స్టే విధించింది. ఆ మదరసాలకు వ్యతిరేకం గా మహ్మద్ తల్హా అన్సారి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ జారీ చేసినా ఆదేశాల మేరకు మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలపై ఇఓడబ్ల్యు దర్యాప్తు నిర్వహిస్తోంది. అయితే ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాలను అలాగే ప్రస్తుతం సాగుతున్న దర్యాప్తును సవాలు చేస్తూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28, జూన్ 11తేదీల్లో ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని ఆ పిటిషన్ కోరింది. అలాగే విచారణ చేపట్టాల్సిందిగా ఏప్రిల్ 23న ప్రభుత్వం ఇచ్చిన ఆదేశా లను కూడా కొట్టివేయా లంటూ ఆ పిటిషన్ కోరింది. జస్టిస్ సరల్ శ్రీవాత్సవ, జస్టిస్ అమితాబ్ కుమార్ రారులతో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం ఈ స్టే ఉత్తర్వులు జారీ చేస్తూ, ఎన్‌హెచ్‌ఆర్‌సీకి, అలాగే ఫిర్యాదీ దారునికి నోటీసులిచ్చింది.
తదుపరి విచారణను నవంబరు 17కి వాయిదా వేసింది. మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయని చెబుతున్న చర్య ఎప్పుడు జరిగిందో తేదీని ఫిర్యా దులో ప్రస్తావించలేదని, అలాగే పేర్కొన్న అభ్యంతరాలు కూడా చాలా అస్పష్టంగా వున్నాయని పిటిషన్ పేర్కొంది. ఉల్లంఘన జరిగిందని చెబు తున్న ఏడాదిలోగానే ఈ ఫిర్యాదు దాఖ లైందా లేదా అనేది కూడా నిర్ధారిం చడానికి సాధ్యం కావడం లేదని పేర్కొంది. అందువల్ల కమిషన్ చేపట్టిన ఈ మొత్తం కసరత్తు అంతా అధికార పరిధికి వెలుపలనే వుందని పిటిషన్ పేర్కొంది.దీనిపై నాలుగు వారాల్లోగా స్పందించాల్సిందిగా కోరుతూ కోర్టు వారికి నోటీసులు జారీ చేసింది.
యూపీ మదర్సాలపై ఆర్థిక నేరాల విభాగ దర్యాప్తుపై స్టే
- Advertisement -
- Advertisement -