Wednesday, December 31, 2025
E-PAPER
Homeబీజినెస్భద్రతలో రారాజు స్టీల్‌బర్డ్ - 2026లో హ్యాట్రిక్ లక్ష్యం..

భద్రతలో రారాజు స్టీల్‌బర్డ్ – 2026లో హ్యాట్రిక్ లక్ష్యం..

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: భారతీయ హెల్మెట్ దిగ్గజం స్టీల్‌బర్డ్ హై టెక్ ఇండియా లిమిటెడ్ అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. 2024, 2025 సంవత్సరాల్లో ప్రపంచంలోనే అత్యధిక హెల్మెట్లు విక్రయించిన సంస్థగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న స్టీల్‌బర్డ్ ఇప్పుడు 2026లో ‘హ్యాట్రిక్’ సాధించే దిశగా వేగంగా దూసుకెళ్తోంది. ఈ ఏడాది ఇప్పటికే 93 లక్షల హెల్మెట్లను విక్రయించింది. కేవలం వ్యాపారమే కాకుండా ‘మిషన్ సేవ్ లైవ్స్’ ద్వారా రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతిరోజూ 60,000 హెల్మెట్లు తయారు చేసేలా ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరిస్తుంది. అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీతో ప్యాకేజింగ్ మినహా మిగిలిన అన్ని భాగాలను సొంతంగానే తయారు చేస్తూ నాణ్యతలో ఎక్కడా రాజీ పడటం లేదు. ఈ సందర్భంగా స్టీల్‌బర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ కపూర్ మాట్లాడుతూ దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా రైడర్ల నమ్మకాన్ని స్టీల్‌బర్డ్ సంపాదించిందన్నారు.‌ ఈ ఏడాది ఇప్పటికే 93 లక్షల (9.3 మిలియన్) హెల్మెట్లు విక్రయించామని తెలిపారు. గత ఏడాది జనవరి 2025లో న్యూఢిల్లీలో జరిగిన అధికారిక గుర్తింపులో 87.5 లక్షల (8.75 మిలియన్) హెల్మెట్ల విక్రయాలతో స్టీల్‌బర్డ్ ప్రపంచంలోనే అగ్రగామి హెల్మెట్ తయారీ సంస్థగా నిలిచిందన్నారు. ఈ గణాంకాల వెనుక గొప్ప లక్ష్యం ఉందన్నారు. రోడ్లపై అనేక మంది ప్రాణాలు కాపాడే అవకాశం వచ్చిందన్నారు. అత్యాధునిక సాంకేతికత, ప్రపంచ స్థాయి తయారీ వ్యవస్థలు, నెక్స్ట్–జెన్ భద్రతా ఆవిష్కరణల్లో నిరంతర పెట్టుబడులతో ప్రతి స్టీల్‌బర్డ్ హెల్మెట్ భద్రత, నమ్మకం, స్టైల్‌కు ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. రోజుకు 60,000 హెల్మెట్లు తయారు చేసేలా ప్రణాళికాబద్ధమైన విస్తరణ, మూడు వరుస సంవత్సరాల గ్లోబల్ నాయకత్వాన్ని సాధించే దిశగా సంస్థకు మరింత బలం ఇస్తుందన్నారు.

భద్రతలో ఏ మాత్రం రాజీ లేదన్నారు. ‌స్టీల్‌బర్డ్ హెల్మెట్ ధరించిన వారి తలకు ప్రమాదం జరిగిన క్షణంలో అత్యున్నత స్థాయి రక్షణ అందించాలన్న నిబద్ధతతో ఉన్నామన్నారు. ఈ లక్ష్య సాధనకు భారత్‌లోని తన తొమ్మిది ఐఎస్ఓ 9000 సర్టిఫైడ్ ప్లాంట్లలో హెల్మెట్‌కు సంబంధించిన దాదాపు ప్రతి భాగాన్ని స్వయంగా (ఇన్–హౌస్) తయారు చేస్తోందన్నారు. ప్రతి ప్లాంట్‌లో రోబోటిక్ పెయింటింగ్ సిస్టమ్స్, ప్రెసిషన్ మోల్డింగ్ టెక్నాలజీ, ఆటోమేషన్ లైన్లు, కఠినమైన నాణ్యత పరీక్షలు అమలులో ఉన్నాయన్నారు. అత్యాధునిక టెస్టింగ్ ల్యాబ్‌లలో ప్రతి బ్యాచ్‌ను ఐఎస్ఐ, ఈసీఈ 22.06, డాట్ వంటి అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా పరీక్ష జరుగుతుందన్నారు. ఒక హెల్మెట్‌లో 3,700కు పైగా విడి భాగాలు ఉంటాయన్నారు. వీటిలో ఈపీఎస్, ఈపీపీ, ఏబీఎస్ షెల్స్, ఫైబర్‌గ్లాస్ షెల్స్, కార్బన్ ఫైబర్ షెల్స్, చిన్‌స్ట్రాప్స్, బకిల్స్, ఇంటీరియర్స్, డెకల్స్, వైజర్స్, ఇంకా అనేక చిన్న భాగాలు ఉంటాయని తెలిపారు. వీటిలో ఇన్–హౌస్‌లో తయారు చేయని ఏకైక వస్తువు ప్యాకేజింగ్ బాక్స్ మాత్రమేనన్నారు.


యునైటెడ్ నేషన్స్ (యూఎన్), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు హెచ్ ఓ) నిర్వహించిన అంతర్జాతీయ రోడ్ సేఫ్టీ ఫోరమ్‌లకు రెండు సార్లు ఆహ్వానించబడిన ఏకైక గ్లోబల్ హెల్మెట్ పరిశ్రమ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఫిబ్రవరి 18 – 20, 2025లో మొరాకో దేశంలోని మరాకెష్‌లో నిర్వహించిన 4వ గ్లోబల్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఆన్ రోడ్ సేఫ్టీలో స్టీల్‌బర్డ్ తన గ్లోబల్ కార్యక్రమం ‘మిషన్ సేవ్ లైవ్స్’ను అధికారికంగా ప్రారంభించింది. ఈ సందర్భంగా 2035 నాటికి ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాద మరణాలను 50 శాతం తగ్గించాలి అన్న యునైటెడ్ నేషన్స్, ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించిన సమగ్ర రోడ్‌మ్యాప్‌ను స్టీల్‌బర్డ్ ప్రపంచానికి పరిచయం చేసింది. భారత్‌లో ‘మిషన్ సేవ్ లైవ్స్ 2.0’ ప్రపంచంలోనే అత్యధిక ద్విచక్ర వాహన మరణాలు నమోదవుతున్న దేశాల్లో భారత్ ఒకటి. ఈ నేపథ్యంలో స్టీల్‌బర్డ్ నకిలీ (ఫేక్),నాణ్యతలేని హెల్మెట్ల వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది.2014 నుంచి 2023 మధ్య కాలంలో భారత్‌లో ద్విచక్ర వాహన ప్రమాదాల్లో ఆరు లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 2023 సంవత్సరంలో మాత్రమే 79,533 మంది మృతి చెందారు. ఈ విషాదకర పరిస్థితికి ప్రధాన కారణం హెల్మెట్ ధరించకపోవడం. స్టీల్‌బర్డ్ దేశవ్యాప్తంగా సామూహిక అవగాహన కార్యక్రమాలు, హెల్మెట్ పంపిణీ కార్యక్రమాలకు మద్దతు ఇస్తోంది. ప్రతి సంవత్సరం ఎన్జీఓలు, కార్పొరేట్లు, సీఎస్ఆర్ సంస్థలు, అంతర్జాతీయ ఏజెన్సీలతో భాగస్వామ్యంతో సుమారు 5 లక్షల హెల్మెట్లు గ్రామాలు, పాఠశాలల్లో పంపిణీ చేయబడుతున్నాయి. లక్షకు పైగా ‘రోడ్ సేఫ్టీ వాలంటీర్లు’ను స్టీల్‌బర్డ్ రూపొందించింది. వీరు ప్రజల్లో సురక్షిత రైడింగ్ పద్ధతులపై అవగాహన పెంచడం, జాతీయ రోడ్ సేఫ్టీ మిషన్లకు మద్దతు ఇవ్వడం, ప్రమాద బాధితులకు అత్యవసర సహాయం వేగంగా అందేలా సహకరించడం వంటి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. స్టీల్‌బర్డ్ కుటుంబంలో 5,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -