Monday, April 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకాళేశ్వరం పనులపై స్టీరింగ్‌ కమిటీ

కాళేశ్వరం పనులపై స్టీరింగ్‌ కమిటీ

- Advertisement -

రోజువారి పురోగతిపై ప్రత్యేక అధికారి నియామకం : నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పునరుద్ధరణ పనుల వేగవంతానికి కల్నల్‌ పరిక్షిత్‌ మెహ్రా కన్వీనర్‌గా ఉన్నత స్థాయి స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీఆర్‌.అంబెడ్కర్‌ సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ కమిటీ వారానికి రెండు సార్లు సమావేశమై ఎప్పటికప్పుడు పనుల పురోగతిని సమీక్షించాలని సూచించారు. రోజు వారి పనులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

డిజైన్‌ పనులు త్వరితగతిన పూర్తి చేసి, సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ (సీడబ్ల్యూ సీ) ఆమోదం కోసం పంపాలని సూచించారు. కేంద్ర జల సంఘంతో సమన్వయం చేసి అవసరమైన అనుమతులు పొందాలన్నారు. ఎల్‌అండ్‌టీ సహా నిర్మాణ సంస్థలు తమ క్యాంపులు, మెస్‌ సదుపాయాలు, లాజిస్టిక్స్‌ను తక్షణమే పునరుద్ధరించాలని ఆదేశించారు. ఇంజినీర్లు, టెక్నీషియన్లు, రిగ్‌ ఆపరేటర్లకు వసతి, ఆహార సమస్యలు రాకుండా చూడాలన్నారు. ఈ సమీక్షలో నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఇ.శ్రీధర్‌, నీటిపారుదల శాఖ సలహాదారులు ఆదిత్యదాస్‌ నాధ్‌, జాయింట్‌ సెక్రటరీ కే.శ్రీనివాస్‌, ఈఎన్‌సీలు రమేష్‌ బాబు, శ్రీనివాస్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -