Tuesday, July 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సోయాబీన్ పంటలో కాండం ఈగ ఉధృతి

సోయాబీన్ పంటలో కాండం ఈగ ఉధృతి

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి : సోయాబీన్ పంటలో కాండం ఈగ(గనే పురుగు) ఉధృతి గమనించడం జరిగిందని ఉప్లూర్ వ్యవసాయ విస్తీర్ణ అధికారి రమేష్ తెలిపారు. గనే పురుగు ఉధృతిని అరికట్టేందుకు రైతులు నివారణ చర్యల్లో భాగంగా మందులను పిచికారి చేయాలని సూచించారు.

గనే పురుగు ఉధృతి నివారణ కోసం బేటా సైఫ్లూత్రిన్ 8.49శాతం మరియు ఇమిడాక్లోప్రిడ్ 19.81 శాతం ఒడి (సొలొమోన్) 140 మిల్లీ లీటర్లు కలిపి ఒక ఎకరాకు పిచికారి చేయాలని సూచించారు. లేకపోతే క్లోరంత్రానిలిప్రోలే 9.3శాతం, లంబ్దాసిహలొత్రిన్ 4.6శాతం జెడ్ సి (అంప్లిగో)  80 మిల్లీ లీటర్ల మందులను, వేపనూనె 1500 పీపీఎం ఒక లీటర్ లో కలిపి పిచికారి చేయాలని వ్యవసాయ విస్తీర్ణ అధికారి రమేష్ రైతులకు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -