-డిఆర్డిఎ పీడీ జయదేవ్ ఆర్య
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ డివిజన్ పరిధిలో మొక్కల పెంపకానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిఆర్డిఎ పీడీ జయదేవ్ ఆర్య అన్నారు. మంగళవారం హుస్నాబాద్ లో హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలలో మొక్కలు నాటడం, ఇందిరమ్మ ఇండ్లు, పారిశుధ్యంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలలో పరిశుద్ధ పనులను చేయాలన్నారు. నిర్మాణాలలో వేగవంతం చేయాలని సూచించారు. మొక్కల పెంపకానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుని పనులు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డి పి ఓ దేవకి దేవి , డి ఎల్ పి ఓ వెంకటేశ్వర్లు, హుస్నాబాద్ ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, అక్కన్నపేట ఎంపీడీవో జయశంకర్ నాయక్ ఎంపీ ఓలు, రమేష్, మోహన్ నాయక్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు .
మొక్కల పెంపకానికి చర్యలు చేపట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES