నలతెలంగాణఫ – హైదరాబాద్: తెలంగాణ రైతులను మోసం చేయడం మానేసి, తక్షణమే ఎరువులు రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని మాజీ హరీశ్ రావు డిమాండ్ చేశారు. ‘దేశంలో యూరియా కొరత లేదని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంటే, ముఖ్యమంత్రి మాత్రం కేంద్రం ఇవ్వడం లేదంటున్నారు. వీరద్దరిలో ఎవరు నిజం? ఎవరు అబద్దం? ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమా? లేక రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వమా’ అని హరీశ్ రావు నిలదీసారు.’దేశవ్యాప్తంగా 143 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే అందుబాటులో 183 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నాయని, ఇప్పటికే 155 లక్షల మెట్రిక్ టన్నులు విక్రయించామని కేంద్రం ప్రకటించింది. ఈ గణాంకాలు నిజమైతే, రైతులకు ఎరువులు అందించడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వమే తప్పిదానికి బాధ్యత వహించాలి’ అని అన్నారు.
తక్షణమే ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలి: హరీశ్ రావు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



