నవతెలంగాణ – కంఠేశ్వర్ : రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్ ను మీసేవ ద్వారా, టీ యాప్ ద్వారా సమర్పించిన కూడా నిజామాబాద్ జిల్లాలో దాదాపు 753 మందికి ఏప్రిల్ నెల పెన్షన్ ను చెల్లించబడలేదని, తక్షణమే వారికి పెన్షన్ చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతూ మంగళవారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజాంబాద్ జిల్లా కమిటీ డి. టి. ఓ./ట్రెజరరీడిప్యూటీ డైరెక్టర్ దశరత్ కి మెమోరాండం సమర్పించినట్లు జిల్లా అధ్యక్షుడు కే. రామ్మోహన్రావు, డివిజన్ అధ్యక్షులు శిర్ప హనుమాన్లు, జిల్లా కోశాధికారి ఈ.వి.యల్. నారాయణ తెలిపారు. పెన్షన్ రానటువంటివారు తక్షణమే సంబంధిత ఎస్.టి. ఓ. కార్యాలయాలకు 7799934018,లేదా 9912994202 నంబర్లకు వీడియోకాల్ చేసి పి.పి.ఓ.ఐ.డిని తెలిపి లైవ్ సర్టిఫికెట్ ను అప్డేట్ చేసుకోవాలని, లేదా సంబంధిత ఎస్ టి ఓ కార్యాలయాలకు ప్రత్యక్షంగా వెళ్లి అప్డేట్ చేసుకోవాలని సంఘ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా కోశాధికారి ఈ వి ఎల్ మాట్లాడుతూ.. ఈనెల 15వ తేదీ లోపుగా పెన్షన్ రానటువంటి వారికి పెన్షన్ చెల్లించేందుకు చర్యలు చేపడతానని సంఘ ప్రతినిధులకు హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. జిల్లా ట్రెజరరీ అధికారిని కలిసిన వారిలో జిల్లా నాయకులు లావు వీరయ్య, హమీరుద్దీన్, లక్ష్మీనారాయణ, మాణిక్యం, యగ్నేష్ తదితరులు ఉన్నారు.
![]() |