Saturday, October 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంహెచ్‌ఎండీఏ వికేంద్రీకరణకు చర్యలు

హెచ్‌ఎండీఏ వికేంద్రీకరణకు చర్యలు

- Advertisement -

– పాలనా సౌలభ్యం దిశగా ప్రణాళికలు
– డివిజన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు
– జోన్‌ స్థాయిలో అధికారుల నియామకం
నవతెలంగాణ-హైదరాబాద్‌ (హెచ్‌ఎండీఏ)

హైదరాబాద్‌ మహానగరం అభివృద్ధిలో భాగంగా హెచ్‌ఎండీఏ (హైదరాబాద్‌ మెట్రో పాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) విస్తరిం చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. రీజనల్‌ రింగ్‌ రోడ్డుకు రెండు కిలోమీటర్ల వరకు హెచ్‌ఎండీఏను విస్తరించింది. హెచ్‌ఎండీఏ విస్తరణ దృష్ట్యా పరిపాలనా సౌలభ్యంలో భాగం గా హెచ్‌ఎండీఏను వికేంద్రీకరించేందుకు ప్రభు త్వం ఏర్పాట్లు చేస్తోంది. అందుకు సంబంధించి ప్రత్యేక ఏజెన్సీలతో రూట్‌ మ్యాప్‌ కూడా రెడీ చేస్తోంది. వికేంద్రీకరణలో భాగంగా హెచ్‌ఎం డీఏ పరిధిని డివిజన్లు, జోన్ల వారీగా విభజించేం దుకు ప్రణాళికలు చేస్తుంది. త్వరలోనే హెచ్‌ఎండీఏ వికేంద్రీకరణ జరగనుంది.

హైదరాబాద్‌ మహానగరం అతి వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం 7,257 చదరపు కిలోమీటర్లుగా ఉన్న హెచ్‌ఎండీఏను 10,472.72 చదరపు కిలోమీటర్లకు విస్తరించ నున్నారు. కొత్త వాటితో కలిపి 11 జిల్లాలు, 104 మండలాలు, 1355 గ్రామాలకు హెచ్‌ఎండీఏ పరిధి పెరగనుంది. రీజనల్‌ రింగు రోడ్డు దాటిన తర్వాత 2 కి.మీ వరకు హెచ్‌ఎండీఏ గ్రోత్‌ కారిడార్‌ కిందకు రానుంది. దాంతో అక్కడి వరకు ప్లానింగ్‌, ఇంజినీరింగ్‌, ఇతర కార్యకలాపాలన్నీ హెచ్‌ఎండీఏ పరిధిలోకి వస్తాయి. ఈ నేపథ్యంలో పరిపాలన సౌలభ్యం కోసం హెచ్‌ఎండీఏ వికేంద్రీకరణ చేసే దిశగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. దాంతో ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ఉన్న ఔటర్‌ రింగు రోడ్డు నుంచి దాదాపు 40 కి.మీ దూరంతో హైదరా బాద్‌ రీజనల్‌ రింగు రోడ్డును ప్రతిపాదించారు. రీజనల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయి. ఉత్తరభాగంలో పూర్తిస్థాయి లో భూ సేకరణ చేపట్టినట్టు అధికారులు చెబు తున్నారు. హెచ్‌ఎండీఏ ప్రస్తుతం ఏడు జిల్లాల్లో విస్తరించింది. కానీ ఇటీవల మరో 5 జిల్లాలకు విస్తరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విధితమే.. దాదాపు 3 వేల చదరపు కిలో మీటర్ల మేరకు విస్తరించింది.

ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ మాదిరిగా హెచ్‌ఎండీఏకు ప్రత్యేక జోనింగ్‌ వ్యవస్థ అనేది లేదు. కేవలం ప్లానింగ్‌ విభాగాన్ని మాత్రమే ఆరు జోన్లుగా విభజించారు. ఏడు జిల్లాల పరిధిలో లేఅవుట్లు, నిర్మాణాల కోసం ప్రజలు హెచ్‌ఎండీఏను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రధానంగా సంగారెడ్డి, యాదాద్రి జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి పనులు చేసుకోవడం ప్రజలకు వ్యయప్రయాసలతో కూడుకున్నది. విస్తరించిన పరిధిని పరిగణనలోకి తీసుకుంటే, ప్రస్తుతం ఉన్న సిబ్బందికి రెండింతలు అదనం గా అవసరం అవుతారు. ఈ కారణాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని హెచ్‌ఎండీఏ వికేంద్రీకరణ కు ప్రభుత్వం పునుకున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రణాళికా విభాగంలో ఉన్న ఆరు జోన్ల సిబ్బంది, అధికారులు నగరం నుంచే సేవలు అందిస్తున్నారు. పరిపాలనా జోన్లు ఏర్పాటైతే క్షేత్రస్థాయి నుంచే అన్ని విభాగాలు పనిచేస్తాయి. ప్రతి జోన్‌కూ ఒక కమిషనర్‌, ప్లానింగ్‌ అధికారులు, సీఈ (చీఫ్‌ ఇంజినీర్‌), ఎస్‌ఈలు (సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌) ఉంటారు. దీని వల్ల జోన్‌ స్థాయిలోనే పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. రానున్న మెగా మాస్టర్‌ ప్లాన్‌తో పాటు పరిపాలనా వికేంద్రీ కరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ వికేంద్రీకరణతో ప్రజలకు హెచ్‌ఎండీఏ సేవలు మరింత చేరువ వుతాయని, పనుల్లో జాప్యం తగ్గుతుందని అధికారులు ఆశిస్తున్నారు. ఇక హెచ్‌ఎండీఏ విస్తరణతో పల్లెలకు మహర్దశ పట్టనుంది. అవి పట్టణాలుగా మారిపో నున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -