Tuesday, January 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎల్లవ్వ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు 

ఎల్లవ్వ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు 

- Advertisement -

వర్ధన్నపేట ఏసిపి నర్సయ్య 
నవతెలంగాణ – పాలకుర్తి

ఆలేటి ఎల్లవ్వ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు చేపట్టామని వర్ధన్నపేట ఏసిపి అంబటి నర్సయ్య తెలిపారు. మండలంలోని బమ్మెర గ్రామ శివారులో గల ఆలేటి ఎల్లవ్వ ఆలయాన్ని మంగళవారం పాలకుర్తి సీఐ వంగాల జానకిరామ్ రెడ్డి, ఎస్సై దూలం పవన్ కుమార్, సర్పంచు జిట్టబోయిన అ రమ్య ప్రశాంత్ యాదవ్, అయ్యంగారిపల్లి సర్పంచ్ ముస్కు సుధాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణతో కలిసి ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 16న జరిగే ఆలేటి ఎల్లవ్వ ఉత్సవాలకు వేలాదిమంది భక్తులు తరలి వస్తారని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా భారీ పోలీసు బందోబస్తు చర్యలు చేపడతామని తెలిపారు. ఉత్సవాల విజయవంతానికి భక్తులు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐలమ్మ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బానోతు రమేష్ నాయక్ స్థానికులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -