జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి అంబికా సోని
నవతెలంగాణ-పాలకుర్తి
పాలకుర్తిలో గల ఐలమ్మ మార్కెట్ యార్డులో పత్తితోపాటు ఇతర పంటల కొనుగోళ్లకు ప్రాధాన్యత కల్పించేందుకు చర్యలు చేపడతామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి కట్ట అంబికా సోని తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో గల ఐలమ్మ మార్కెట్ యార్డును సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా అంబికా సోని మాట్లాడుతూ రైతుల పండించిన పంటలు కొనుగోలు చేసేందుకు మార్కెట్ యార్డు అణువుగా ఉందని తెలిపారు. కొనుగోళ్లకు చర్యలు చేపట్టేందుకు మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశిస్తామన్నారు. మార్కెట్ యార్డు నిరుపయోగంగా ఉండడంతో మధ్య దళారీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. మధ్య దళారీలను కట్టడి చేసేందుకు మార్కెట్లో వ్యాపారాలను ప్రారంభించేందుకు కసరత్తు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి డివిజన్ వ్యవసాయ శాఖ ఉపసంచాలకులు అజ్మీర పరశురాం నాయక్, మండల వ్యవసాయ శాఖ సింగారపు కరుణాకర్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
పాలకుర్తి మార్కెట్లో పత్తి కొనుగోలుకు చర్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES