Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్క్రైస్తవ మైనార్టీ సమస్యల పరిష్కారానికి చర్యలు..

క్రైస్తవ మైనార్టీ సమస్యల పరిష్కారానికి చర్యలు..

- Advertisement -

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
క్రైస్తవ మైనార్టీ సమస్యల పరిష్కారానికి అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ అన్నారు. బుధవారం క్రైస్తవ సంక్షేమం పై తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ తో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో  పాస్టర్ లతో సమావేశం నిర్వహించారు. క్రైస్తవ బరియల్ గ్రౌండ్స్ అభివృద్ధి, భూ కేటాయింపు,  చర్చి నిర్మాణ అనుమతులు, కమ్యూనిటీ హాల్ నిర్మాణం,  క్రైస్తవ మైనారిటీలకు కుల ధ్రువీకరణ పత్రాల పంపిణీ, పీఏం 15 పాయింట్ ప్రోగ్రాం పై చర్చించి పలు సూచనలు చేశారు.


ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ మాట్లాడుతూ  క్రైస్తవ సోదరుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు.  క్రైస్తవ సోదరులకు ఉన్న ప్రతి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రతిష్ట చర్యలు తీసుకుంటుందని అన్నారు. క్రైస్తవ సోదరులకు ఏవైనా సమస్యలు ఉంటే సోమవారం జరిగే ప్రధాని కార్యక్రమంలో సమర్పించాలని, ప్రాధాన్యత అంశంగా వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.


జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 571 అనుసరించి అవకాశం మేరకు  భూ కేటాయింపులు చేయడం జరుగుతుందని అన్నారు.  క్రైస్తవ సోదరులకు భూ సమస్యలు ఏమైనా ఉంటే సంబంధిత లింకు డాక్యుమెంట్స్ సమర్పిస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు.  చర్చీల నిర్మాణానికి నిబంధనల ప్రకారం అవసరమైన అనుమతులు 15 రోజుల లోగా  జారీ చేయడం జరుగుతుందని అన్నారు. కుల ధ్రువీకరణ పత్రం 15 రోజులలో మీసేవ యాక్ట్ సిటీజన్ చార్టర్ ప్రకారం జారీ చేస్తామని అన్నారు. చర్చిల నిర్మాణానికి ఆన్లైన్లో అన్ని పర్మిషన్లు తీసుకున్న తర్వాత పనులు మొదలు పెట్టాలని అన్నారు.


ఎస్సీ కార్పొరేషన్ కింద స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు సహకారం అందిస్తామని అన్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అవకాశం మేరకు పరిశీలిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు రుణాలకు  క్రిస్టియన్ మతం తీసుకున్న వారు అందరూ అర్హులు అవుతారని అన్నారు. సమావేశంలో పాల్గొన్న పాస్టర్స్ మాట్లాడుతూ* జిల్లాలో క్రైస్తవుల కోసం స్మశాన వాటిక , కమ్యూనిటీ హాల్స్, చర్చిల నిర్మాణానికి అనువైన స్థలాలు కేటాయించాలని కోరారు. ఈ సమావేశంలో  వేములవాడ ఆర్టీవో రాధాబాయి, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఎం. ఏ.భారతి జిల్లాలోని పాస్టర్స్ సంబంధిత శాఖల  అధికారులు, తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad