రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణలో త్వరలో చేపట్టనున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) అమలుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్ నుంచి సర్ కార్యక్రమం పురోగతి, పెండింగ్‌లో ఉన్న ఎన్నికల సంబంధిత అంశాలపై ఈఆర్‌ఓలు, ఏఆర్‌ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఓటర్ జాబితా నవీకరణ, క్లెయిమ్‌లు, అభ్యంతరాల
పరిష్కారం, క్షేత్రస్థాయి గుర్తింపు, డేటా ఎంట్రీ, తదితర అంశాలపై సీఈఓకు అధికారులు నివేదికలు సమర్పించారు. పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేసి, ఓటర్ జాబితా నాణ్యతను మరింత మెరుగుపర్చే దిశగా పనిచేయాలని సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర డిప్యూటీ సీఈఓ హరిసింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.



