– పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ.. పాక్, సౌదీ మధ్య చర్చలు
– సౌదీ రక్షణ మంత్రితో పాకిస్తాన్ సీడీఎఫ్ ఆసిమ్ మునీర్ భేటీ
– ఇరాన్ దాడుల నేపథ్యంలో భద్రతా పరిస్థితులపై చర్చ
రియాద్: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం తీవ్రమవుతున్న సమయంలో పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య భద్రతా చర్చలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. ఇరాన్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యాధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్) ఫీల్డ్ మార్షల్ సయ్యద్ ఆసిమ్ మునీర్ సౌదీ అరేబియాకు వెళ్లి అక్కడి రక్షణ మంత్రి ప్రిన్స్ ఖాలిద్ బిన్ సల్మాన్‌తో సమావేశమయ్యారు. దీంతో ‘ఇస్లామిక్ నాటో’ కూటమి ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయా? అన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఇరాన్, అమెరికా-ఇజ్రాయిల్ సంయుక్త దాడుల తర్వాత ఆ ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాపై డ్రోన్లు, క్షిపణి దాడులు జరిగాయి. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో కొత్త భద్రతా సమీకరణాలకు దారితీస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
‘ఇస్లామిక్ నాటో’ కూటమి దిశగా అడుగులు..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



