Tuesday, January 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు

రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు

- Advertisement -

కవితకు ప్రాథమిక నివేదిక సమర్పించిన కమిటీలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేయాలని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వివిధ అంశాలపై ఏర్పాటైన అధ్యయన కమిటీలు నివేదించాయి. సోమవారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ తెలంగాణ జాగృతి కార్యాలయంలో 50 కమిటీల సభ్యులతో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. ఈ కమిటీలు తెలంగాణ రాష్ట్ర స్థితిగతులు, సమగ్రాభివృద్ధి, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కారాలు, వనరుల వినియోగంపై అధ్యయనం చేసి ప్రాథమిక నివేదికను సమర్పించాయి. తెలంగాణ సమగ్రాభివృద్ధికి అవసరమైన బ్లూ ప్రింట్‌ రూపొందించే పనిలో నిమగమైన తెలంగాణ జాగృతి.. ప్రజాభిప్రాయం మేరకు రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేయాలని వివిధ కమిటీ సభ్యులు నివేదించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -