విమర్శించే గొంతుకలను నిశ్శబ్దపరచడం, శిక్షించటం భారతదేశంలో మోడీ నియంతత్వ పాలనలో కీలక అంశం.
భీమా కోరేగావ్ అక్రమ అరెస్టులు, పౌరసత్వ సవరణ చట్టం సందర్భంగా విద్యార్థి నిరసన కారులను అరెస్టు చేయడం, పోరాడే ప్రజలపై ఊపా వంటి నిర్బంధ చట్టాలను ఆయుధాలుగా ఎలా వాడుతున్నారో ఈ పుస్తకం వివరిస్తుంది. పెట్రేగుతున్న ఫాసిస్టు రాజ్యాన్ని, దాని యంత్రాంగ కుయుక్తులను వ్యతిరేకించే అన్ని శక్తులు ఎలా నిర్బంధానికి గురికావాల్సి వస్తుందో వివరిస్తుంది. ప్రజాస్వామ్యం ముసుగులో నిరంకుశ విధానాలు ఎలా అమలవుతున్నాయో, అవి దళిత, బహుజన, ఆదివాసి, మత మైనారిటీల, మహిళల హక్కులను ఏ విధంగా కాలరాస్తా యనే విషయాన్ని రాజకీయ ఖైదీల దష్టి కోణం నుండి ఈ పుస్తకం వివరిస్తుంది .
రాజకీయ ఖైదీల జీవితానుభవాల ద్వారా భారతదేశ ప్రస్తుత పరిస్థితులను ఈ పుస్తకంలో సుచిత్ర విజయన్, ఫ్రాన్సిస్గా రెఛియాలు చిత్రించారు. జైలు లోపల- బయట రాజకీయ ఖైదీలు ,వాళ్ళ కుటుంబాల ప్రతిఘటనకు సంబంధించి చిన్న చిన్న విషయాలను తెలియజేసే వ్యక్తిగత కథనాలతో పాటు రాజకీయ, న్యాయ విశ్లేషణలు చేశారు. వ్యవస్థలు ద్వంసం అవుతున్న తీరు, హక్కులు హరించుకుపోతున్న విధానం తెలియజేశారు.
ఈ పుస్తకం కేవలం ప్రభుత్వ అణచివేత పద్ధతులను మాత్రమే కాదు. వాటినన్నిటిని ఎదిరిస్తూ పౌర సమాజం ఎలా నిలబడుతుందో కూడా వివరిస్తుంది.
- కె.పి.అశోక్
కుమార్
9700000948