- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలున్నా.. అమెరికా నుంచి కొత్త టారిఫ్ భయాలు మన మార్కెట్లను వెంటాడాయి. ప్రధాన షేర్లయిన రిలయన్స్, ట్రెంట్‌లో అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. ఆంక్షల వేళ రష్యా చమురును రిలయన్స్ దిగుమతి చేసుకుంటోందంటూ వచ్చిన కథనాలతో కంపెనీ షేర్లు ఒత్తిడికి లోనయ్యాయి. ఈ వార్తలు అవాస్తవం అంటూ సంస్థ ఖండించినప్పటికీ.. కంపెనీ షేర్లు ఇంట్రాడేలో 5 శాతం మేర నష్టపోయాయి. చివరికి 4.39 శాతం నష్టంతో 1508.90 వద్ద ముగిశాయి. క్యూ3 ఆదాయ అంచనాలు అందుకోవడంలో విఫలమైన నేపథ్యంలో ట్రెంట్ షేర్లు 8.46 శాతం నష్టపోయి రూ.4055 వద్ద ముగిశాయి.
- Advertisement -



