Monday, November 3, 2025
E-PAPER
Homeతాజా వార్తలులాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : దేశీయ మార్కెట్లు ఈ వారంలో రెండో రోజును లాభాలతో ప్రారంభించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంతో దేశ జీడీపీ గణాంకాలు అంచనాలకు మించి నమోదుకావడంతో సూచీలు సానుకూలంగా కదలాడుతున్నాయి. అలాగే మార్కెట్ అస్థిరతను సూచించే వీఐఎక్స్‌ ఇండెక్స్ నాలుగు శాతానికి పడిపోవడం మార్కెట్ స్థిరత్వాన్ని సూచిస్తోంది. ఉదయం 9.31 గంటల సమయంలో సెన్సెక్స్ 152 పాయింట్ల లాభంతో 80,516 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు ఎగబాకి, 24,660 వద్ద కదలాడుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ జీవనకాల కనిష్ఠమైన 88.16 వద్ద ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -