నవతెలంగాణ-హైదరాబాద్ : అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వెలువడిన బలహీన సంకేతాలు, ముఖ్యంగా ఆసియా మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు భారతీయ ఈక్విటీ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. గురువారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. మదుపరుల సెంటిమెంట్ దెబ్బతినడంతో అమ్మకాల ఒత్తిడి వెల్లువెత్తింది.
మార్కెట్ ముగిసే సమయానికి, బీఎస్ఈ సెన్సెక్స్ 644.64 పాయింట్లు (0.79 శాతం) క్షీణించి 80,951.99 వద్ద స్థిరపడింది. ఇవాళ్టి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 80,489.92 కనిష్ఠ స్థాయిని తాకి, 81,323.24 గరిష్ఠ స్థాయి మధ్య కదలాడింది. ఇదే బాటలో, ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 203.75 పాయింట్లు (0.82 శాతం) నష్టపోయి 24,609.70 వద్ద ముగిసింది.