నవతెలంగాణ – ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.28 నిమిషాలకు సెన్సెక్స్ 329 పాయింట్లు లాభపడి 66,919 వద్ద, నిఫ్టీ 78 పాయింట్లు లాభపడి 19790 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 82.01 వద్ద ట్రేడవుతోంది. దాదాపు 1546 షేర్లు ముందుకెళ్లగా.. 504 షేర్లు క్షీణించాయి. 104 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. నిఫ్టీలో.. విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాలను నమోదు చేస్తుండగా.. ఎల్‌టీఐమైండ్‌ట్రీ, టైటాన్ కంపెనీ, డారెడ్డీస్ ల్యాబ్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, సన్ ఫార్మా నష్టాల్లో కొనసాగుతున్నాయి.