Friday, March 20, 2026
E-PAPER
Homeకవితరాతిబంధాలు

రాతిబంధాలు

- Advertisement -

ఇప్పుడు అనిపిస్తోంది
మృత్యు పాషానికే
మూడుముళ్లు వేశానా ఆని
నడిచిన ఏడడగులు కాటికేనని
అగ్నిసాక్షి తంతు
దావనలమై కాల్చేస్తుందని
పెనవేసుకున్న పేగుబంధాలూ
ఉరితాళ్ళువతున్నాయని
రక్తసంబంధాలు రాతిబండలే
కలిమిలేములు లేని సహచర్యం
కల్తీ ప్రేమలే అని ప్రేమల్ని పాతిపెట్టి
కామాల్ని పండిస్తారని
స్వేచ్ఛ ఇప్పుడొక దారితప్పిన విషపురుగు
జీవనవిధ్వంసాన్ని సృష్టిస్తోన్న
ఆధునిక టైంబాంబు
పతితులారా.. భ్రష్టులారా..
బాధాతప్త దృష్టులరా ఏడవండేవండి
గుండెలుపగిలేలా ఏడవండి
విశ్వమంతా వినిపించేలా
కుళ్ళిన సమాజపు కళ్ళు తెరిచేలా
కొత్త లోకాల దారులు తెరిచేవరకు
కొత్త వెలుగులు ప్రకాశించేవరకు
ఎడవండేడవండి.. ఎడవండేడవండి…
– బాలాచారి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -