Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeసినిమాఅప్పటి వరకు షూటింగ్‌లు ఆపండి

అప్పటి వరకు షూటింగ్‌లు ఆపండి

- Advertisement -

సినీ కార్మికుల వేతనాల పెంపు అంశంపై నిర్మాతలు, ఫిల్మ్‌ ఫెడరేషన్‌ నాయకుల మధ్య జరుగుతున్న చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కార్మికుల వేతనాల పెంపు విషయం తేలే వరకు ఎలాంటి చిత్రీకరణలు చేపట్టవద్దని నిర్మాతలకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఫిల్మ్‌ ఫెడరేషన్‌ యూనియన్లతో ఎవరూ సంప్రదింపులు జరుపవద్దని, తదుపరి సూచనలు వచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని వెల్లడించింది.
అలాగే స్టూడియోలు, అవుట్‌డోర్‌ యూనిట్లు అనుమతి లేకుండా ఎలాంటి సేవలు అందించవద్దు. ఈ ఆదేశాలను నిర్మాతలు, స్టూడియో యజమానులు తీవ్రంగా పరిగణించాలి. తెలుగు పరిశ్రమలోని 24 విభాగాల యూనియన్లు ఏకపక్షంగా సమ్మెకు పిలుపునివ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. చర్చలు, సంప్రదింపులకు తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సభ్యులు దూరంగా ఉండాలని కూడా ఫిల్మ్‌ ఛాంబర్‌ సూచించింది.
తెలుగు ఫిల్మ్‌ ఇండిస్టీ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ తాము కోరినట్లుగా నిర్మాతలు 30 శాతం వేతనాల్ని పెంచి ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శాశ్వత పరిష్కారం, మెరుగైన భవిష్యత్తు కోసం అంతా ఐక్యతతో ఉండాలని ఫిల్మ్‌ ఛాంబర్‌ నిర్మాతలకు పిలునిచ్చింది. ఈ అంశంపై కో ఆర్డినేషన్‌ కమిటీ గురువారం కూడా ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రతినిధులు, నిర్మాతలు, ఫిల్మ్‌ ఫెడరేషన్‌ నాయకులతో చర్చలు జరిపింది. అయితే ఏవీ ఒక్క కొలిక్కి రాలేదు. అయితే మరో నాలుగు రోజుల్లో దీనికి పరిష్కారం దొరికే అవకాశం ఉండొచ్చని వీరశంకర్‌ తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img