Wednesday, May 14, 2025
Homeజిల్లాలురైస్ మిల్లర్ల దోపిడి అరికట్టండి: రైతు సంఘం

రైస్ మిల్లర్ల దోపిడి అరికట్టండి: రైతు సంఘం

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి: గాంధారి మండల కేంద్రంలో ఓం శివా రైస్ మిల్ ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన రైతు సంఘం జిల్లా కార్యదర్శి మోతి రామ్ నాయక్ మాట్లాడుతూ.. నిన్న రామ్ లక్ష్మణ్ పల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యాన్ని తూకం చేసి ఓం శివ రైస్ మిల్ కి ధాన్యం లోడింగ్ ను రైస్ మిల్లర్ యజమాన్యం కింటాల్కి నాలుగు కిలోలు చొప్పున కట్ చేస్తానని అన్నారు. అలా అయితేనే అన్లోడింగ్ చేసుకుంటాను.. లేకపోతే లేదు అని మొండి కేసినారు. రైతులు లబోదిబోం అనుకుంటూ రైతు సంఘాన్ని ఆశ్రయించడం జరిగింది. రైతు సంఘం నాయకత్వం పాల్గొని ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అందుకనే రాష్ట్రంలో జిల్లాలో మొత్తం ఇదే పద్ధతులు కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాటి నుండి ఏ అధికారి కూడా ఇటువంటి వారిపై చర్యలు తీసుకోకుండా ఎటుబడితే అటు దోచుకుంటారని అన్నారు. ఇప్పటికే ఐదుసార్లు డిపి గారిని క్రింది అధికారులకు ఎన్ని విధాలుగా విన్నవించినా.. ఫలితం మాత్రం శూన్యం. రైతులు మాత్రం నిండుగా మోసపోతా ఉన్నారు. ఒక్క లోడింగ్ వెనక 25 కింటల్లు ధాన్యం నష్టమవుతుంది. ఈ మొత్తాన్ని రైస్ మిల్లర్లు దోచుకుంటున్నారు. అధికార యంత్రంగా మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తా ఉంది. అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రైతులు ఉన్నారని అన్నారు. ఒక వైపు మద్దతు ధర లేదు. మరోవైపు మరో పెట్టుబడి బాగా పెరిగింది. రైతులు పండించిన పంట చేతికి వచ్చేసరికి దళారుల చేతిలో నష్టపోతా ఉంటే, ఆత్మహత్యలు పెరగవా అని అన్నారు. దీని రూపుమాపడం కోసం రైతులందరూ ఈనెల 20న గ్రామీణ బంద్ లో పాల్గొనాలని కోరినారు. ఈ సమ్మెను విజయవంతం చేయాలని ఎల్లారెడ్డిలో ర్యాలీ నిర్వహిస్తున్నామని, రైతులందరూ ఏకాకాలంలో పాల్గొని ఆ యొక్క సమ్మెను విజయవంతం చేయాలని కోరినారు. ఈ కార్యక్రమంలో రైతులు ప్రకాష్ నాయక్, వసంతరావు నాయక్, దశరథ్ ,బిచ్చుందా నాయక్, స్వామి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -