Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంనల్లికుట్ల రాజకీయాలు మానుకో

నల్లికుట్ల రాజకీయాలు మానుకో

- Advertisement -

లూజ్‌ కామెంట్లు చేస్తే గుంజీలు తీయిస్తా : ఎంపీ ఈటలకు జగ్గారెడ్డి హెచ్చరిక
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఎంపీ ఈటల రాజేందర్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలను టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి ఖండించారు. బీజేపీలో కీలక పదవి కోసం నల్లికుట్ల రాజకీ యాలు చేయడం మానుకోవా లని హెచ్చరించారు. సీఎంపై లూజ్‌ కామెంట్లు చేస్తే బట్టలిప్పి నడిరోడ్డు లో గుంజీలు తీయిస్తానని అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. మల్కాజిగిరి పార్ల మెంటు పరిధిలో సమస్యలున్నాయనీ, వాటిని పరిష్కరించాలంటూ ఎప్పు డైనా సీఎం దగ్గరకు పోయి అడిగావా? అని ప్రశ్నించారు. ఇప్పటికే చాలా సార్లు సీఎంపై నోరు జారావు… జాగ్రత్త అని ఈటలను హెచ్చరించారు. సీఎంను తిడితే బీజేపీ అధ్యక్ష పదవి వస్తుందనుకుంటున్నావేమో? ఆ పదవి రాదనే సంగతి మరచిపోవద్దని గుర్తు చేశారు. సీఎంపై పరిధి దాటి మాట్లాడితే, తాను మాట్లాడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad