పోప్ లియో ప్రకటన
చర్చలతోనే సమస్యకు పరిష్కారం
వాటికన్ : పశ్చిమాసియాలో ఇరాన్ వర్సెస్ అమెరికా, ఇజ్రాయిల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ పోప్ లియో కీలక ప్రకటన చేశారు. తక్షణమే యుద్ధానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.”పశ్చిమాసియాలో క్రైస్తవుల తరఫున, సన్మార్గంలో నడిచే స్త్రీ, పురుషులందరి తరఫున, ఈ సంఘర్షణకు కారణమైన వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చర్చల మార్గాలు తిరిగి తెరుచుకోవడానికి తక్షణమే కాల్పులను విరమించండి. హింస అనేది ఎన్నటికీ ప్రజలు కోరుకుంటున్న న్యాయం, స్థిరత్వం, శాంతిని తీసుకురాలేదు” అని అన్నారు. వాస్తవానికి ఆయన అమెరికాకు చెందిన వ్యక్తి అయినప్పటికీ, తన ప్రసంగంలో యూఎస్, ఇజ్రాయిల్ పేర్లను నేరుగా ప్రస్తావించకపోవడం గమనార్హం.



