Wednesday, October 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆగిన బీటీ రోడ్డు పనులను చేపట్టాలి: సీపీఐ(ఎం)

ఆగిన బీటీ రోడ్డు పనులను చేపట్టాలి: సీపీఐ(ఎం)

- Advertisement -

నవతెలంగాణ – బల్మూరు 
మండల కేంద్రం లోని పోలీస్ స్టేషన్ పక్కనుండి మహాదేవపూర్ వరకు మంజూరైన బీటీ రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి శంకర్ నాయక్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం డిమాండ్ చేశారు. రోడ్డుకు ఇరువైపులా గుంతలు తీసి మట్టి వేయడంతో పొలాలకు పోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రోడ్డు పనులు చేపట్టక పోవడం ఆందోళనకరమని అన్నారు. బిటీ రోడ్డు పనులు ప్రారంభం చేసి కిలోమీటర్ పైగా మట్టి వేసి పనులు ఆపివేయడంతో రైతుల పొలాలకు వెళ్లడానికి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని  అన్నారు.  

బల్మూరు, చెన్నారం, మహదేవపూర్ వరకు వెళ్లే రైతులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. రైతులు రోడ్డు వేసే కాంట్రాక్టర్ కి ఎన్నిసార్లు చెప్పినా  నిర్లక్ష్యం చేస్తున్నారని, పూర్వపు బండ్ల దారి నక్ష ఎట్లా ఉంటే అట్లా రోడ్డు వేయాలని, రైతులు ఎవరు అడ్డు లేరని అన్నారు. ఒకరిద్దరు కావాలని ఉద్దేశపూర్వకంగా ఆపుతున్నారని, వారికి నక్ష ఎట్లా ఉంటే అట్లా చూయించి రోడ్డు వేయాలని, లేనిచో రైతులతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి బీటీ రోడ్డు పూర్తి చేసేందుకు ఆర్ అండ్ బి అధికారులు చొరవ చూపాలన్నారు.

పనులు మంజూరై నెలు గడుస్తున్నా పట్టించుకునే పరిస్థితి లేదని ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారని అన్నారు. రోడ్డుకు ఇరువైపుల గుంతలు తీయడంతో వేసిన మట్టి కూడా సవుడు మట్టి, బంక మట్టి ఉండడం వల్ల ఎడ్ల బండి పశువులు వెళ్లలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి రోడ్డు పనులు చేపట్టకపోతే పార్టీ ఆధ్వర్యంలో ప్రజలతో రైతులతో ఆందోళన చేపట్టనున్నట్లు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి లాల్ మొహమ్మద్, రైతులు ఎండి గౌస్, చంద్రశేఖర్ రెడ్డి, బాలస్వామి, బాబర్, బురాన్, ఎండీ,సుల్తాన్ గడెల తిరుపతయ్య, గడేల రామకృష్ణ, ఊశయ్య పరిసర ప్రాంతాల రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -