Friday, October 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మ్యాచర్ రావడం లేదని కొనుగోలు నిలిపివేత...

మ్యాచర్ రావడం లేదని కొనుగోలు నిలిపివేత…

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి : గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గాను ఆరుగాలము కష్టించి పండించిన పంట చేతికి వచ్చిన తర్వాత మిషన్తో పంటను కోసి సహకార సొసైటీ ఐకెపి కేంద్రాలకు తరలిస్తే మ్యాచర్ రావడం లేదనే కారణంతో పది రోజులుగా కొనుగోలు చేయక తాము తీవ్రంగా నష్టపోయామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.ఇందల్ వాయి సహకార సొసైటీ పరిధిలోని ఇందల్ వాయి తాండా లో గత పది, పదిహేను రోజుల క్రితం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. గత రెండు రోజుల క్రితం హమాలీలు కేంద్రానికి చేరుకున్నారు. మంగళవారం హమారీలు వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రం ఇంచార్జ్ పరువూరు రైతులకు సంబంధించిన ధాన్యాన్ని మ్యాచర్ను పరిశీలించారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం నేచర్ వచ్చిన ఒక గంటలోపే భారీ వర్షం రావడంతో ధాన్యం తడిసి ముద్దయింది. సరైన గ్రౌండ్ లేక రైతులు వేసుకున్న ధాన్యం భారీ వర్షం కారణంగా చిన్నపాటి కాలువల ద్వారా కొట్టుకుపోయింది. దీంతో దిక్కు  తోచక రైతులు ఆవేదన చెందారు. ఇదే కాకుండా అద్దెకు తమ వద్ద ఉన్న టార్పలైన్లను కింద వేసుకొని ధాన్యాన్ని కుప్పగా పోశారు. తమ ధాన్యాన్ని కొనుక్కోలు కేంద్రానికి తీసుకుని వచ్చే పది రోజులైనా ఇప్పటికీ ఒక్క బస్తా ధాన్యం కాంట కాలేదని, సొసైటీ పాలకవర్గం అధికారులు పట్టించుకోక పోవడంతోనే తమకు ఇబ్బందులు తప్పడం లేదని రైతులు పేర్కొంటున్నారు. సహకార సొసైటీ ద్వారా రైతులకు తార్ఫాలింగ్లను పంపిణీ చేయకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోయామని తడిసిన ధాన్యాన్ని 500 రూపాయల బోనస్ చెల్లించి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -