పిల్లల ఎదుగుదలలో ఆహారం ఎంత ముఖ్యమో, మానసిక ఆహారంగా కథలూ అంతే ముఖ్యమైనవి. శరీరానికి విటమిన్లు ఎలా అవసరమో, పిల్లల మెదడుకు కథలు అలాంటి మానసిక విటమిన్లు. కథలు వినడం, చదవడం వల్ల పిల్లల బుద్ధి, భావోద్వేగాలు, ఊహాశక్తి, నైతికతగా వికసిస్తాయి. సైకాలజీ ఇదే విషయాన్ని బలంగా చెబుతోంది. కథల శక్తికి ప్రత్యక్ష ఉదాహరణ మూడున్నరేళ్ల మా హిమకర్ కథ
రోజూ సరోజా రారు, హిమకర్‌కి కథలు చెప్పడం నా అలవాటు. కథలు వింటూ పెరిగిన హిమకర్, కేవలం కథలు వినడమే కాదు.. తానే కథలు సష్టించడం మొదలుపెట్టాడు. వయస్సు కేవలం మూడున్నర సంవత్సరాలు. ఒక రోజు తనే స్వయంగా చెప్పిన కథ ఇది: ”ఒక అడవిలో చెట్టు కింద ఒక సింహం పడుకుంది. నిద్రలేచిన తర్వాత దానికి బాగా ఆకలి వేసింది. కానీ అక్కడి నుంచి కదలకుండా, చుట్టూ చూస్తూ ఉంటుంది. అప్పుడు తన కాళ్ల దగ్గరగా చీమలు వరుసగా వెళ్తూ ఉంటాయి. సింహం వెంటనే తన నాలుకతో వాటిని పట్టుకుంటుంది. ఇది చూసిన తల్లి చీమకు కోపం వస్తుంది. వెంటనే సింహం కాలు మీద కుడుతుంది. సింహం బాధతో దగ్గుతుంది. అప్పుడు చీమలు అన్నీ కింద పడిపోతాయి.”
ఈ చిన్న కథలోనే మనకు ఏమి కనిపిస్తోంది? క్రమబద్ధమైన ఆలోచన – మొదలు, మధ్య, ముగింపు. కారణం, ఫలిత సంబంధం (చీమలను తినడం? తల్లి చీమ కాటు? సింహానికి బాధ), భావోద్వేగ అవగాహన – ఆకలి, కోపం, బాధ.
ఊహాశక్తి – సింహం, చీమల మధ్య సంఘటనల నిర్మాణం. ఇది కేవలం ‘పిల్లల కథ’ కాదు. ఇది ఒక చిన్న మెదడు ఆలోచించడం నేర్చుకున్న విధానం.
1. కథలతో మెదడు అభివద్ధి(Brain Development) : కథలు వినేప్పుడు పిల్లల మెదడులో multiple areas ఒకేసారి యాక్టివ్ అవుతాయి.
– భాషా కేంద్రం Language center)
-భావోద్వేగ కేంద్రం (Amygdala), జ్ఞాపకశక్తి కేంద్రం (Hippocampus), ఊహాశక్తి, ప్రణాళిక కేంద్రం (Prefrontal Cortex)
కథలు కేవలం వినోదం కాదు, అవి మెదడులో కొత్త న్యూరల్ కనెక్షన్లు సష్టిస్తాయి. రోజూ నిద్రకు ముందు కథ చెప్పడం వల్ల కొద్ది నెలల్లోనే పిల్లవాడు కొత్త పదాలు వాడటం, సంఘటనలను వరుసగా చెప్పడం ప్రారంభించాడు. ఇది కథల వల్ల మెదడు సమాచారాన్ని క్రమబద్ధీకరించడంలో నైపుణ్యం పెరిగినట్లు చూపిస్తుంది.
2. భావోద్వేగ బుద్ధి (Emotional Intelligence) కథలు : కథల్లో పాత్రలు ఆనందం, భయం, కోపం, బాధ వంటి భావాలను అనుభవిస్తాయి. పిల్లలు ఆ పాత్రలతో ఎమోషనల్ ఐడెంటిఫికేషన్ చేస్తారు.
పిల్లలు కథల ద్వారా:
– ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం, న తమ భావాలను గుర్తించడం, న భావాలను నియంత్రించడం నేర్చుకుంటారు
‘అబద్ధం చెప్పిన బాలుడు’ కథ విన్న పిల్లవాడు, అబద్ధం వల్ల కలిగే నష్టం భావోద్వేగ స్థాయిలో అర్థం చేసుకుంటాడు. కేవలం ఉపదేశంతో కన్నా కథ ద్వారా వచ్చిన ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
3. కథలు, ఊహాశక్తి Imagination, Creativity): చిన్న వయసులో ఊహాశక్తి బలంగా పెరిగితేనే సజనాత్మక ఆలోచన అభివద్ధి చెందుతుంది. కథలు పిల్లల మెదడులో ఒక ‘మానసిక సినిమా’ని సష్టిస్తాయి. ఒక బాలిక పంచతంత్ర కథలు చదువుతూ జంతువులకు మాటలు వస్తాయని ఊహిస్తుంది. తర్వాత ఆమె డ్రాయింగ్‌లో, కథల ఆధారంగా కొత్త పాత్రలను సష్టిస్తుంది. ఇది క్రియేటివ్ థింకింగ్‌కు బలమైన పునాది.
4. నైతిక విలువలు, జీవన పాఠాలు (Moral Development)
లారెన్స్ (Kohlberg) నైతిక అభివద్ధి సిద్ధాంతం ప్రకారం, పిల్లలు కథల ద్వారా ఒప్పు తప్పు మధ్య తేడాను నేర్చుకుంటారు. కథలు సాఫ్ట్ మోరల్ ట్రైనింగ్ టూల్ లాంటివి. రామాయణం, మహాభారతం వంటి ఇతిహాస కథలు.. త్యాగం, ధైర్యం, ధర్మం వంటి విలువలను పిల్లల మనసులో లోతుగా నాటుతాయి.
5. ట్రామా హీలింగ్, కథలు (Therapeutic Role of Stories) : సైకాలజీలో దీనిని Bibliotherapy లేదా Story Therapy అంటారు. భయాలు, ఒంటరితనం, అసురక్షిత భావన ఉన్న పిల్లలకు కథలు హీలింగ్ టూల్‌గా పనిచేస్తాయి. తరచూ భయపడే ఒక చిన్నారి, ధైర్యంగా ఉండే కథా పాత్రను ఇష్టపడుతుంది. ఆ పాత్రతో ఐడెంటిఫై అవుతూ, తన భయాన్ని ఎదుర్కొనే శక్తిని నెమ్మదిగా పెంచుకుంటుంది. మొబైల్, టాబ్లెట్ స్క్రీన్లు పిల్లల దష్టిని ఆకర్షిస్తున్నప్పటికీ, లైవ్ స్టోరీటెల్లింగ్ మెదడుకు మరింత ఆరోగ్యకరం.
కథ చెప్పే సమయంలో:
న తల్లి, తండ్రి, పిల్లల మధ్య బంధం బలపడుతుంది, న దష్టి కేంద్రీకరణ (Attention Span) పెరుగుతుంది, న భాషా నైపుణ్యం మెరుగవుతుంది
పిల్లలు కథలు వింటూ పెరిగితే, వాళ్ల మెదడు కథల మాదిరిగానే సంఘటనలను అర్థం చేసుకోవడం, కారణాలు గమనించడం, భావాలను గుర్తించడం నేర్చుకుంటుంది.
కథలు భవిష్యత్తు ఆలోచనలకు విత్తనాలు
మొబైల్ స్క్రీన్ ముందు నిశ్శబ్దంగా కూర్చున్న పిల్లల కన్నా, తల్లి ఒడిలో కూర్చుని కథ వింటూ, తానే కథ చెప్పే స్థాయికి ఎదిగిన పిల్లలే లోతుగా ఆలోచించే వ్యక్తులు అవుతారు. కథలు పిల్లలకి విలాసం కాదు అవి అవసరం. శరీరానికి కాల్షియం, ఐరన్ ఎంత అవసరమో, మెదడుకు కథలు అంతే అవసరం. ఈ రోజు మనం పిల్లలకు చెప్పే ఒక చిన్న కథ రేపటి వారి ఆలోచనా విధానాన్ని, వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది. కాబట్టి, రోజూ ఒక కథ పిల్లల భవిష్యత్తుకు ఒక బలమైన అడుగు.
డా|| హిప్నో పద్మా కమలాకర్,
9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్, హిప్నో థెరపిస్ట్



