Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంరోబోటిక్‌ టెక్నాలజీతో స్టార్మ్‌ వాటర్‌ డ్రైన్‌ క్లీనింగ్‌

రోబోటిక్‌ టెక్నాలజీతో స్టార్మ్‌ వాటర్‌ డ్రైన్‌ క్లీనింగ్‌

- Advertisement -

అత్యాధునిక టెక్నాలజీకి జీహెచ్‌ఎంసీ శ్రీకారం
ముంపు సమస్యల పరిష్కారం కోసం..పైలట్‌ ప్రాజెక్టు

నవతెలంగాణ-సిటీబ్యూరో
వర్షాకాలంలో వరదలతో గ్రేటర్‌ అతలాకుతలమవుతోంది. ఈ క్రమంలో సమస్యల పరిష్కారం కోసం జీహెచ్‌ఎంసీ ఆధునిక టెక్నాలజీ వినియోగానికి సిద్ధమవుతోంది. రోబోటిక్‌ టెక్నాలజీతో స్టార్మ్‌ వాటర్‌ డ్రైన్‌ క్లీనింగ్‌ను ప్రవేశపెట్టింది. నగరంలో వాటర్‌ డ్రైన్‌లు పొంగిపొర్లడం, ట్రాఫిక్‌ జామ్‌, లోతట్టు ప్రాంతాలు, బస్తీలు, కాలనీలు ముంపునకు గురవ్వడం వంటి సమస్యలు సర్వసాధారణమయ్యాయి. కాల్వల్లో చెత్తాచెదారం అడ్డు పడటం, కాల్వలు దెబ్బతినడం, అధిక వర్షపాతంతో కాల్వలు పొంగిపొర్లుతుంటాయి. వీటన్నిటికీ చెక్‌ పెట్టేందుకు రోబోటిక్‌ అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది.

మొట్టమొదటగా సర్కిల్‌-12
నాలాల్లో బెడ్‌షీట్స్‌, బెడ్స్‌, ప్లాస్టిక్‌ వస్తువులు, వ్యర్థాలు వేస్తున్నారు. దాంతో వర్షం నీరు, మురుగు పారుదలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు సిబ్బంది ఎప్పటికప్పడూ వాటిని క్లీన్‌ చేస్తున్నా సమస్యలు తప్పడం లేదు. దాంతో కొత్త టెక్నాలజీ వినియోగానికి జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో వర్షపు నీటి కాలువల శుభ్రతకు రోబోటిక్‌ సాంకేతికతను ఉపయోగించుకుంటున్నది. మొట్టమొదటగా సర్కిల్‌-12లో పైలట్‌ ప్రాజెక్ట్‌గా స్టార్మ్‌ వాటర్‌ డ్రైన్‌ క్లీనింగ్‌ను ప్రారంభించారు. ప్రత్యేకంగా అధునాతన సీసీటీవీ కెమెరాలు అమర్చారు. ఈ విధానంతో కాలువల్లోని అడ్డంకులను కచ్చితంగా గుర్తించి, తొలగించడం, బురదను వేగంగా, సమర్థవంతంగా తొలగించి వర్షాల సమయంలో నీటి నిల్వలను తగ్గించి డ్రయినేజీ సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. ఫీల్డ్‌ స్టాఫ్‌, ప్రజల భద్రతకు ఎలాంటి హానీ జరగకుండా పటిష్టమైన భద్రతా ప్రమాణాలను పాటిస్తూ క్లీనింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. పైలెట్‌ ప్రాజెక్ట్‌గా చేపట్టిన ఈ విధానం సఫలీకృతమైతే జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని సర్కిళ్లలో అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

పరిశీలించిన అధికారులు
అధునాతన సీసీటీవీ కెమెరాలు ఉన్న రోబోటిక్‌ యంత్రాల ద్వారా ప్రధాన రోడ్డు క్రాసింగ్‌లో వర్షపు నీటి కాలువల శుభ్రత చేపట్టగా, చీఫ్‌ ఇంజినీర్‌ (మెయింటెనెన్స్‌) సహదేవ్‌ రత్నాకర్‌ ఈ విధానంలో క్లీనింగ్‌ ప్రక్రియను బుధవారం రాత్రి మెహదీపట్నం ఎన్‌ఎండీసీ జంక్షన్‌లో పరిశీలించారు. రోబోటిక్‌ టెక్నాలజీతో స్టార్మ్‌ వాటర్‌ డ్రైన్‌ క్లీనింగ్‌ పైలట్‌ ప్రాజెక్ట్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వి.కర్ణన్‌ అభిప్రాయపడ్డారు. ఈ విధానం విజయవంతం అయితే వాటర్‌ డ్రైన్‌లు పొంగిపొర్లడం, ట్రాఫిక్‌ జామ్‌లు, లోతట్టు ప్రాంతాల ముంపు చాలా వరకూ తగ్గుతుందని చెప్పారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad