మళ్లీ బీఆర్‌ఎస్ రోజులే వస్తాయి :మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్
నవతెలంగాణ-తిరుమలగిరి
రాష్ట్రంలో విచిత్రమైన పాలన నడుస్తున్నదని, రానున్న రోజుల్లో తుంగతుర్తి గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని, రాబోయేది బీఆర్‌ఎస్ రోజులేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీలో నూతన చైర్మెన్ ఎస్. రఘునందన్‌రెడ్డి, నూతన వైస్‌చైర్మెన్ ఎంగోజు గోవిందమ్మ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వారంతా బీఆర్‌ఎస్ కార్యాలయలో జగదీశ్‌రెడ్డి, గాదరి కిశోర్‌కుమార్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు. గెలిచిన బీఆర్‌ఎస్ చైర్మెన్, వైస్‌చైర్మెన్, కౌన్సిలర్‌లను శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అడుగడుగునా అరాచకాలు, దాడులు జరుగుతున్నాయని అన్నారు. రేవంత్ రెడ్డితో బీజేపీ చేతులు కలిపి కేసీఆర్, కేటీఆర్‌పై కాళేశ్వరం విషయంలో పెట్టిన కేసులు అన్ని ఉత్తివేనని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల సంఘం ప్రేక్షకపాత్ర పొషిస్తున్నదని, ఎన్నికల సంఘం కాంగ్రెస్ కు బీటీమ్‌లా వ్యవహరిస్తోందన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తోడు దొంగలన్నారు. ఆ రెండు పార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో చాలా చోట్ల పొత్తులు పెట్టుకున్నాయని అన్నారు. కేసీఆర్‌పై ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా బీఆర్‌ఎస్ కార్యకర్తలు వీరోచితంగా పోరాటం చేస్తున్నారని తెలిపారు. రాబోయే రోజులు బీఆర్‌ఎస్‌వేనన్నారు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని.. ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు లక్ష్మి, రమేష్, సోమలక్ష్మి, యాకుబ్‌నాయక్, గీత, జ్యోతి నరోత్తంరెడ్డి, త్రిశూల్, బత్తుల శకుంతల పాల్గొన్నారు.
రాష్ట్రంలో విచిత్రమైన పాలన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



