Wednesday, February 4, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఎన్నికల వేళ విచిత్రాలు

ఎన్నికల వేళ విచిత్రాలు

- Advertisement -

చివరి నిమిషం వరకూ చేరికలు..మార్పులు
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌

మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో ఆసక్తికర ఘటనలు, అనూహ్య పరిణామాలు చోటుచే సుకున్నాయి. ప్రధాన పార్టీలకు సంబంధిం చిన వార్డు అభ్యర్థుల జాబితాను చివరి రోజు నామినేషన్‌.. విత్‌ డ్రా చివరి నిమిషం వరకు ప్రకటించకపోవడం ఉత్కంఠ లేపింది. ఏ పార్టీ నుంచి టికెట్‌ వస్తుందో తెలియక అభ్యర్థులు రెండు పార్టీల నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. అధికార పార్టీ నుంచి టికెట్‌ రాకపోవడంతో ఇతర పార్టీలో చేరి బీ-ఫాం దాఖలు చేసిన సంఘటనలు ఉన్నాయి. అధికార పార్టీలో ఉండి టికెట్‌ ఆశించి భంగపడిన నాయకులు నామినేషన్‌ విత్‌ డ్రా చేసుకోకుండా ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు.

చివరి నిమిషంలో అభ్యర్థి మార్పు
కాంగ్రెస్‌ పార్టీలో నామినేషన్‌ విత్‌ డ్రాకు చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చడం చర్చనీయాంశమైంది. బీ ఫాం ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని మార్చుతూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. పట్టణంలోని 34వ వార్డు బొక్కలగూడలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా తౌఫిక్‌కు ముందుగా టికెట్‌ ప్రకటించి బీ ఫామ్‌ అందించారు. విత్‌డ్రా ముగిసే సమయంలో చివరి నిమిషంలో తౌఫిక్‌ను మారుస్తూ ఆయన స్థానంలో దేవారెడ్డికి బీ-ఫామ్‌ అందించారు. దీంతో తౌఫిక్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచారు. టికెట్‌ విషయంలో డీసీసీ అధ్యక్షులు నరేష్‌ జాదవ్‌ ఫోన్‌ చేసి విత్‌ డ్రా చేసుకోవాలని చెప్పారని తెలిపారు. అయినప్పటికీ తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని అన్నారు.

తమ్ముడి కోసం అన్న త్యాగం
కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గెలుపును కాంక్షిస్తూ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకున్నారు. పట్టణంలోని 12వ వార్డు న్యూహౌసింగ్‌ బోర్డు నుంచి బీఆర్‌ఎస్‌ తరపున నామినేషన్‌ దాఖలు చేసిన ఆ వార్డు సిట్టింగ్‌ కౌన్సిలర్‌ పవన్‌ నాయక్‌ పోటీ నుంచి తప్పుకున్నాడు. అదే వార్డులో ఆయన సోదరుడు జాదవ్‌ శ్రావణ్‌ నాయక్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో తమ్ముడి కోసం ఆయన మంగళవారం తన నామినేషన్‌ను విత్‌ డ్రా చేసుకున్నాడు.

చివరి నిమిషంలో అభ్యర్థి ఖరారు
పట్టణంలోని 12వ వార్డు న్యూ హౌసింగ్‌ బోర్డు నుంచి కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఆశించి భంగపడిన రాథోడ్‌ సురేష్‌ బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాడు. మాజీ మంత్రి జోగు రామన్న ఆయనకు గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాథోడ్‌ సురేష్‌కు బీఆర్‌ఎస్‌ తరపున మద్దతు ఉంటుందని అన్నారు. మరోవైపు అదే వార్డు నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పవన్‌ నాయక్‌ నామినేషన్‌ విత్‌ డ్రా చేసుకోగా ఆయన స్థానంలో ఈయన పోటీలో ఉండనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -