Thursday, January 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వీధి కుక్కల తరలింపు 

వీధి కుక్కల తరలింపు 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ
మర్రిగూడ మండల కేంద్రంలో సోమవారం మర్రిగూడ టౌన్ సర్పంచ్ వీరమళ్ళ శిరీష-లోకేష్ గౌడ్ ఆధ్వర్యంలో వీధి కుక్కలను తరలించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో వీధి కుక్కల బెడద విపరీతంగా ఉన్నదని,చిన్న పెద్ద తేడా లేకుండా నిత్యం వీధి కుక్కల దాడిలో అనేకమంది గాయాల పాలవుతున్నారని,గొర్రెలు,మేకలు సైతం వీధి కుక్కల దాడిలో గాయపడుతున్నాయని అన్నారు.వాహనాలకు కుక్కలు అడ్డుగా వచ్చి పలువురికి గాయాలైన సందర్భాలు ఉన్నాయని తెలిపారు.సమస్యను గ్రహించి గ్రామంలో గల్లి గల్లి తిరుగుతూ వీధి కుక్కలను సిబ్బంది సహాయంతో తరలించడం జరుగుతుందని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -