- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : వీధి కుక్కల అంశంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వీధికుక్కల దాడిలో చిన్నారులు, వృద్ధులు గాయపడినా, చనిపోయినా.. చర్యలు తీసుకోవడంలో విఫలమైనందున తాము నిర్దేశించిన పరిహారాన్ని సంబంధిత రాష్ట్రం చెల్లించాల్సి ఉంటుందని జస్టిస్ విక్రమ్‌నాథ్ హెచ్చరించారు. అంతేకాకుండా వీధి కుక్కులకు ఆహారం పెడుతున్నవారు సైతం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. కుక్కలపై అంత ప్రేమ ఉంటే తమ ఇళ్లకు తీసుకెళ్లి పెంచుకోవాలని న్యాయమూర్తి అన్నారు.
- Advertisement -



