- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
మండలంలోని అగ్రహార తండా గ్రామంలో ఎనిమిదేళ్ల బాలుడు నేనావత్ వర్షిత్ (8) ఇంటిముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు విచక్షణ రహితంగా దాడి చేసి బాలుడిని తీవ్రంగా గాయపరిచాయి. ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు స్థానికులు కుక్కల దాడి నుంచి బాలుడుని కాపాడి మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని తల్లిదండ్రులు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు. గ్రామంలో వీధి కుక్కల ఉదృతం ఎక్కువ ఉందని స్థానికులు తెలిపారు. రాత్రిపూట బయటికి వెళ్లాలంటే వీధి కుక్కలు దాడి చేస్తాయని భయంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
- Advertisement -