నవతెలంగాణ – మల్హర్ రావు
విద్యుత్ తీగలు షార్ట్ సర్క్యూట్ కావడంతో మండలం ఆన్ సాన్ పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని తండాలో విధి ద్విపాలు వెలగడం లేదని స్థానిక పాలకవర్గం ఆరోపిస్తోంది. ఈ సమస్యను పరిష్కరించాలని విద్యుత్ శాఖ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.వీధి ద్విపాలు ఉన్న షార్ట్ సర్కియిట్ కావడంతో విధి ద్విపాలు వెలగడం లేదన్నారు. ఈ విషయంపై జెఎల్ఎం నవ తెలంగాణ వివరణ కోరగా ప్రజలు అక్రమంగా తీగలు వేయడమే కాక కొంకలకు బండరాళ్ల బరువు వేయడంతో మాటిమాటికి తీగలు షార్ట్ సర్క్యూట్ కావడం జరుగుతుందని తెలిపారు.
ఉచిత జీరో మీటర్లు బిగించుకోవాలని అవగాహన కల్పిస్తున్నాం. సమస్యను త్వరలోనే పరిస్కారం చేస్తాం.అలాగే తాడిచెర్లలో బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీ సిఎస్ఆర్ నిధుల కింద ఆన్ సాన్ పల్లి గ్రామానికి నాలుగునెలల క్రితం 80 ఎల్ఈడి బల్బులు వచ్చినట్లుగా, అవి వృధాగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపై బదిలై వెళ్లిన పంచాయతీ కార్యదర్శిని నవ తెలంగాణ వివరణ కోరగా.. జిపికి 65 ఏల్ఈడి బల్బులు వచ్చింది వాస్తవమేని అందులో 15 బల్బులు రెండు నెలల క్రితం సిబ్బందితో పెట్టించామని మిగతావి ప్రస్తుత కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలిపారు. మిగతావి జిపికి పంపిస్తామన్నారు.



