- Advertisement -
నవతెలంగాణ – రాయికల్
రాయికల్ పట్టణంలోని 1వ వార్డు క్లబ్ రోడ్డులో వీధి దీపాలు వెలగకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం ఏడుగంటలు దాటినా లైట్లు వెలగకపోవడంతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ ప్రాంతంలో ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉండటంతో పాములు, తేళ్లు సంచరిస్తున్నాయని, ప్రమాదం జరిగే అవకాశం ఉందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వీధి దీపాలను మరమ్మతులు చేసి సమస్యను పరిష్కరించాలని స్థానికులు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.
- Advertisement -



