Saturday, March 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసివిల్‌ సర్వీసెస్‌లో తెలంగాణ అభ్యర్థుల సత్తా

సివిల్‌ సర్వీసెస్‌లో తెలంగాణ అభ్యర్థుల సత్తా

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సివిల్‌ సర్వీసెస్‌ 2025 ఫైనల్‌ ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. సివిల్స్‌ సాధించే లక్ష్యంతో ప్రిపేరయ్యే పేద కుటుంబీకులకు అండగా నిలిచేందుకు రాజీవ్‌ సివిల్స్‌ అభయ హస్తం పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. సింగరేణి సంస్థ అధ్వర్యంలో సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షలకు హాజరైన 202 మంది అభ్యర్థులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించింది. రాజీవ్‌ సివిల్స్‌ అభయ హస్తం సాయం అందుకున్న అభ్యర్థుల్లో 51 మంది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. వీరిలో 20 మంది సివిల్స్‌ తుది ఫలితాల్లో మంచి ర్యాంకులతో విజేతలుగా నిలిచారు.

అభినందనలు
రాష్ట్రం నుంచి మెయిన్స్‌ ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులందరికీ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. పట్టుదల, కృషి, లక్ష్యసాధన పట్ల నిబద్ధతతో తెలంగాణ యువత సివిల్‌ సర్వీసెస్‌ వంటి అత్యున్నత పరీక్షల్లో సత్తా చాటడం రాష్ట్రానికి గర్వకారణమని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -